KTR : ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. రేవంత్‌, రాహుల్‌పై కేటీఆర్ ఫైర్‌

తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఆరు నెల‌ల్లో ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలలో నిరుద్యోగుల‌కు ఒక్క‌ ఉద్యోగ నోటిఫికేషన్.. క‌నీసం ఒక్క‌ ఉద్యోగమైనా ఇవ్వ‌డంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

By :  Eha Tv
Update: 2024-07-14 07:15 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఆరు నెల‌ల్లో ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలలో నిరుద్యోగుల‌కు ఒక్క‌ ఉద్యోగ నోటిఫికేషన్.. క‌నీసం ఒక్క‌ ఉద్యోగమైనా ఇవ్వ‌డంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అప్పటి కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ యువతను రెచ్చగొట్టిన ఇద్దరు రాజకీయ నిరుద్యోగ మోసగాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని విమ‌ర్శించారు. గత 7 నెలలుగా ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటైన 1వ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ యువత హైదరాబాద్ వీధుల్లో పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే.. మీరంతా ఎక్కడున్నారు? అని ప్ర‌శ్నించారు.

గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ‌ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని తెలంగాణ యువకులకు మీరు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. మీ పార్టీ.. మీ వాగ్దానాల‌ను తేదీలతో పాటు అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో కూడా ప్రచురించించాయి. ఇప్పుడు 7 నెలలకు పైగా అయ్యింది. కానీ ఇప్పటివరకు ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని అన్నారు. “మీ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్‌లు జారీ చేయకుండానే 2 లక్షల ఉద్యోగాల‌ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తుంది? తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరూ పట్టించుకోవ‌డం తేదు.. దయచేసి స్పందించండి' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News