ఇకపై తాట తీసుడే.. విజయశాంతి వార్నింగ్..!
ఇకపై తాట తీసుడే.. విజయశాంతి వార్నింగ్..!
ఇకపై తాట తీసుడే.. విజయశాంతి వార్నింగ్..!
సోషల్ మీడియాలో మహిళల పట్ల చేస్తున్న వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి ఎక్స్ వేదికగా కోరారు. '' ఫోన్‌ల ద్వారాను ప్రత్యక్షంగాను ఎందరో మహిళలు నన్ను ఒక అంశాన్ని అడుగుతున్నారు. ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్, కామెంట్స్ ఇంకా ఎంతో బాధకు గురి చేసే ధోరణి, మా వంటి మహిళలకు పని చెయ్యలేని పరిస్థితులను కల్పిస్తున్నవి రాములమ్మా అని...
ప్రతి సమస్యా కంప్లయింట్ చెయ్యబడాలి... ప్రతి సమస్యా పరిష్కరించబడాలి. అయితే, మన దేశంలో చాలా సమస్యల పరిష్కారానికి అనుగుణంగా నియమనిబంధనలు, చట్టాలు ఉన్నాయి... ఆఫీసుల్లో మహిళల రక్షణకు విమెన్ ప్రొటెక్షన్ సెల్స్ పెట్టాలనే సూచన కూడా ఉంది. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆ పోస్టింగ్స్, కామెంట్స్, స్టేట్‌మెంట్స్ ఇవి ఎన్నో కుటుంబాలల్ల బాధను కలిగిస్తూ, సమాజంల కష్టాన్ని కలిగిస్తూ పని చేయలేని పరిస్థితులు ఉంటున్నవి అని పలువురు మహిళలు చెబ్తున్నరు. ఇక దుర్మార్గపు ధోరణిల కొందరు నడిపే సోషల్ మీడియా ఎట్లుంటదో... సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వానికి జింకలు, నెమళ్ళ వీడియోల ద్వారా HCU సందర్భంగా అవగతమై తీవ్రంగా వ్యవహరించి తీరాలని సీఎం రేవంత్ గారు స్వయంగా అభిప్రాయ పడ్డట్లు వార్తలు వచ్చినవి. ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ మొత్తం రాష్ట్రంలోని ప్రతి మహిళ సమస్య పట్ల పై అంశమై ఇప్పటికే తగు విధానాన్ని పాటిస్తున్నది. అయితే, ప్రతి సమస్యా పట్లా తక్షణమే స్పందించి తీవ్ర చర్యలు తీసుకునే వ్యవస్థను సంపూర్ణ అధికారాలతో మరింత పటిష్టంగా నడిపించగలదని, అవసరమైన అరెస్ట్‌లు, తదనంతర కార్యాచరణ ద్వారా మహిళా లోకానికి ఆత్మ ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలదని నమ్ముతూ... నా ఈ అభిప్రాయాన్ని మహిళా అభ్యున్నతికై నిరంతరం పనిచేస్తున్న సీఎం రేవంత్ గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. హరహర మహాదేవ్.. జై తెలంగాణ'' అంటూ ఆమె ట్వీట్ చేశారు.