సూర్యాపేట జిల్లా ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి(SI Anthi reddy).

సూర్యాపేట జిల్లా ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి(SI Anthi reddy). ఓ కేసు విషయంలో కొందరు వ్యక్తుల వద్ద నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై అంతిరెడ్డి ని పట్టుకున్న ఏసీబీ అధికారులు. సూర్యాపేట(Suryapet) జిల్లా చింతలపాలెం(Chintalapalem) మండలం ఎస్సై అంతిరెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB ) అధికారులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ (AP)రాష్ట్రంలోని పల్నాడు(Palnadu) జిల్లాకు చెందిన వర్ల వెంకట్రావు(Varla Venktrav) గతంలో చింతలపాలెం మండలంలో పీడీఎస్(PDS) బియ్యం కొనుగోలు చేస్తూ గతంలో పట్టుబడ్డాడు. అయితే కేసు ఫైనల్‌కు రావడంతో ఆ కేసును కొట్టి వేయాలంటే 15 వేలు ఇవ్వాలని అంతిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో వెంకట్రావు 10 వేలు ఇస్తామని అంగీకరించి నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ సమీపంలోని చర్చి దగ్గర రూ.10 వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ehatv

ehatv

Next Story