ఐ లవ్‌ జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ పొలిటిషియన్‌ కాదు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..!

ఐ లవ్‌ జగన్‌.. పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ పొలిటిషియన్‌ కాదు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..!

By :  ehatv
Update: 2025-04-10 06:11 GMT

ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఓ ప్రాడక్యాస్‌ ఇంటర్వ్వూ ఇచ్చారు. ఇంగ్లీష్‌లో ఉన్న ఇంటర్వ్యూ పలు ఆసక్తికర అంశాలు ఆమె వెల్లడించారు. తనకు జైలు జీవితం చాలా కష్టంగా ఉందని, ఇలాంటి జీవితం ఎవరికీ రాకూడదని కోరుకున్నారు. ఐదున్నర నెలలు జైలులో గడిపానని.. జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్‌ అయ్యానన్నారు. ఇష్టమైన రాజకీయనాయకుడు ఎవరంటే తన తండ్రి కేసీఆరేనని అన్నారు. కాంగ్రెస్‌లో సోనియాగాంధీ చాలా డిగ్నిటీ ఉన్న మహిళ అని, ఆమె చాలా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్‌లో సచిన్‌ పైలట్ చాలా మంచి నాయకుడన్నారు. మమతాబెనర్జీ, జయలలిత, సుష్మాస్వరాజ్‌ వంటి మహిళా నేతలు అంటే తనకు ఇష్టమన్నారు. తెలుగురాష్ట్రాల రాజకీయనాయకుల గురించి యాంకర్ ప్రశ్నిస్తే.. ముందుగా ఐ లవ్‌ జగన్‌ అన్నారు. కానీ జగన్‌ ప్రతిపక్షంలో ఉంటేనే ఆయనలోని ఫైటింగ్‌ స్పిరిట్ నచ్చుతుందన్నారు. లోకేష్‌ చాలా మెచ్యూర్డ్‌గా మారారని.. చాలా బాగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చాలా డిగ్నిటీతో ఉండే నాయకుడన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ను తాను యాక్టివ్ పొలిటీషియన్ అనుకోవడం లేదని.. పూర్తిగా లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్‌గా మారాడని.. ఆయన విధానాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయన్నారు. ఒకనాడు సౌతిండియా, నార్త్ ఇండియా అన్న పవన్‌కు సడెన్‌గా నార్త్‌ ఇండియాపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. రేపు మళ్లీ మారిపోయి తమిళనాడు వెళ్లి హిందీ మనకెందుకు అన్నా అంటాడని ఆమె వ్యంగ్యాంగా వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి చాలా వివాదాస్పద నేత అని.. ఒవైసీ సోదరులు అధికారం ఎవరికి ఉంటే వారితో ఉంటారని కవిత అన్నారు.

Tags:    

Similar News