Congress MP : 'హైడ్రా' భావితరాల భవిష్యత్తు.. 80% ప్రజలు స్వాగతిస్తున్నారు

హైడ్రా అనేది భావితరాల భవిష్యత్తు అని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పి చేయలేని పని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు

Update: 2024-09-28 12:39 GMT

హైడ్రా అనేది భావితరాల భవిష్యత్తు అని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పి చేయలేని పని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. హరీష్ రావు, కేటీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని.. 80% ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారని.. మిగిలిన 20% వ్యతిరేకించే వాళ్లు గత పది సంవత్సరాల నుండి రాజకీయ అండతో కబ్జాలు చేసిన రాజకీయ నాయకులేన‌న్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

హైదరాబాద్ లో28 వేల అక్రమ కట్టడాలు నాలాల మీద చెరువుల మీద ఉన్నాయి. వాటిని కూల్చేస్తే తప్ప హైదరాబాద్ మనుగడ సాగించలేదని, మీడియా తో పాటు ప్రజలు కూల్చివేతలకు సహకరించాలని నాడు సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడగా, ప్రస్తుతం ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావ్ ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు.

అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో మూసీ ప్రక్షాళన చేయలే.. చెరువులు, కుంటలు అక్రమణల నుండి కాపాడలేకపోయారని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు అసెంబ్లీలో అక్రమ కట్టడాల గురించి పర్మిషన్లు లేని భవనాల గురించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అసెంబ్లీలో మాట్లాడారు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి నేడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న తేడా ఏమిటో తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. ప్రగల్బాలు పలకడం కాదు.. నాలుగు గోడల మధ్యలో చర్చలు పెట్టడం కాదు.. చెప్పిన పనిని.. ఇచ్చే హామీని నెరవేర్చడమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అన్నారు.

నాడు దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికే క్రమంలో ముందుగా విషం వచ్చింది విషం రాగానే దేవతలు చిలకడం ఆపలేదు.. అమృతం వచ్చేవరకు క్షీరసాగర మధనం చేశారన్నారు. చరిత్రలో లేక్ సిటీ గా ఉన్న హైదరాబాదును లేక్ సిటీ గానే ఉంచాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. హైదరాబాదులో నివసిస్తున్నటువంటి ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొని, ఇంట్లో వస్తువులు కరవై ప్రభుత్వం చేసే సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి రావద్దని.. దీనికి ఒక పరిష్కార మార్గం చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు.

వర్షాలతో వరదలతో హైదరాబాద్ ప్రజలు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. గతంలో మీ మామ కేసీఆర్ 28 వేల ఇండ్లు అక్రమంగా నిర్మించారని చెప్పారు. వాటిని కూలగొట్ట లేకపోవడానికి కారణమేమిటో హరీష్ రావు చెప్పాలన్నారు. గత పది ఏండ్లు మీరు చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే ఈరోజు ఈ పేద ప్రజలు అన్యాయమయ్యే వాళ్ళు కాదన్నారు. హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయంతోనే మీరు ఇలా చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలు హైదరాబాద్ భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం లేదన్నారు.

మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇప్పటికే 15 వేల దాకా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు జ‌రిగింద‌న్నారు. నది పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్టు ప్లేసులుగా మారుస్తం అన్నారు. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మూసి నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి కల్పిస్తాం అన్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూస్తామ‌న్నారు.

నది పరివాహక ప్రాంతంలోని చారిత్రాక భవనాలను టూరిస్టు ప్లేసులుగా తీర్చిదిద్దుతాము. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ చేస్తాం. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరం లోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను టై అప్ చేసి అర్హులకు పథకాలు స్టూడెంట్లకు అకడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ ఎన్జీవోల సహకారంతో స్కూళ్లమ్యాపింగ్.. స్టూడెంట్లకు అడ్మిషన్స్ అత్యంత పారదర్శకంగా తరలింపు.. పునరావాస ప్రక్రియ పూర్తిచేస్తామ‌న్నారు. మహిళలకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చూస్తాం.. ఇష్టమైన వృత్తి చేపట్టేందుకు సహకారం అందిస్తామన్నారు.

హైదరాబాద్ భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు అమలుకు నిర్వాసిత కుటుంబాలు సహకారం అందించాలని కోరారు. నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు ఉంటే వారి విద్యా సంవత్సరానికి ఆటంకం లేకుండా తరలింపు ప్రక్రియ చేపడతామన్నారు. సోషల్ మీడియా ద్వారా కొంత మంది ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఆందోళనలు, అల్లర్లు సృష్టించేలా పోస్టులు పెడున్నారని, అలాంటివాళ్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుందన్నారు. పురాతన మెట్ల బావులు పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకున్నార‌ని వెల్ల‌డించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. నగరంలో పురాతన మెట్ల బావులను పునరుద్ధ‌రించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారని తెలిపారు.

Tags:    

Similar News