వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు అంటూ ప్రచురితమైన శీర్షికను జత చేస్తూ ఎక్స్‌లో కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు అంటూ ప్రచురితమైన శీర్షికను జత చేస్తూ ఎక్స్‌లో కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ''సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే..తెలంగాణ బతుకు సున్నా అని.. మరోసారి రుజువుచేసిన సందర్భమిది. తెలివి లేని దద్దమ్మను గద్దెనెక్కిస్తారు.. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తారు.. కోట్లాది మంది జీవితాలతో చెలగాటమాడతారు.. ఆర్థిక వృద్దిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాన్ని పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిది.టూరిస్టు పార్టీలను.నమ్మితే జరిగే విధ్వంసమిది.. విజన్ లేనోళ్ల చేతిలో.. రాష్ట్రాన్ని పెడితే జరిగే వినాశనమిది. నాటి పదేళ్ల దార్శనిక పాలనకు.. నేటి దగుల్బాజీ విధానాలకు మధ్య తేడాను నాలుగు కోట్ల సమాజం నిశితంగా గమనిస్తోంది. ఇక జీవితంలో ఈ ఢిల్లీ పార్టీలను.తెలంగాణ నమ్మదు.. మళ్లీ ఎప్పటికీ మోసపోదు..జై తెలంగాణ'' అంటూ ఆయన పోస్ట్ చేశారు.

ehatv

ehatv

Next Story