హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్‌లలో ఒకటిగా ఉంది. జనాభా, వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా పెరిగింది.

హైదరాబాద్ ప్రముఖ ఐటీ హబ్‌లలో ఒకటిగా ఉంది. జనాభా, వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా ఐటీ కారిడార్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఓల్డ్ సిటీ చార్మినార్, ఫలక్‌నుమా, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణంగా మారాయి. హైదరాబాద్‌లో సగటు వాహన వేగం గత ఏడాది నాటికి గంటకు 18 కి.మీ.కి పడిపోయిందని ట్రాఫిక్ పోలీస్ డేటా చెబుతోంది. ఇది 2023లో 15-18 కి.మీ. నుండి కొంచెం మెరుగైనా, ఇప్పటికీ రద్దీ ఎక్కువగానే ఉంది.

ఉదయం 8:30 నుండి 11:00, సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు ట్రాఫిక్ గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో ఆఫీసులకు వెళ్లే వాళ్లు, తిరిగి వచ్చే వాళ్ల వల్ల రోడ్లు బ్లాక్ అవుతాయి. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య గత ఏడాది కంటే దాదాపు 10% పెరిగింది. రోజూ రోడ్లపై 20 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. నగరంలో చాలా రోడ్లు ఇరుకుగా ఉన్నాయి, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో. కొత్త ప్రాంతాల్లో రోడ్లు విస్తరించినా, ట్రాఫిక్ వాల్యూమ్‌కి తగ్గట్టు సరిపోవడం లేదు. రోడ్ల మీద అక్రమంగా పార్క్ చేసే వాహనాల వల్ల ట్రాఫిక్ ప్రవాహం ఆగిపోతుంది. దీనికి తోడు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వల్ల కాలినడక ప్రయాణీకులకు కూడా ఇబ్బంది. వర్షం పడితే రోడ్లు చెరువుల్లా మారడం, డ్రైనేజీ సమస్యల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. హైటెక్ సిటీ - గచ్చిబౌలి మార్గంలో ఐటీ ఉద్యోగుల వల్ల ఈ రూట్‌లో ఎప్పుడూ జామ్. సైబర్ టవర్స్, మాదాపూర్ జంక్షన్‌లు ఎక్కువగా బ్లాక్ అవుతాయి. పంజాగుట్టా - అమీర్‌పేట్ కమర్షియల్ హబ్ కావడంతో ఇక్కడ రద్దీ తప్పదు. చార్మినార్ - లా బజార్ మార్గంలో

ఇరుకు రోడ్లు, షాపింగ్ క్రౌడ్‌ వల్ల ట్రాఫిక్ స్తంభిస్తుంది. సికింద్రాబాద్ - పారడైజ్ మార్గంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ సమీపంలో ఎప్పుడూ హడావిడి.

కొత్త మెట్రో ఫేజ్‌లు రాయదుర్గ్-కోకాపేట్, ఎల్‌బీ నగర్-హయత్ నగర్ పూర్తయితే రోడ్లపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్స్ పెరగడం, వర్షంతో రోడ్లు జలమయం కావడం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నారు. కొందరు 2 కి.మీ. దూరానికి 2 గంటలు పడుతోందని ఫిర్యాదు చేశారు.

ehatv

ehatv

Next Story