Jagga Reddy : రైతులు నిరసనలు చేస్తుంటే చిరంజీవి ఎందుకు మద్దతు తెలపలేదు.?

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం తొలి విడ‌త‌ రైతు రుణ మాఫీ చేసింది. ల‌బ్ధి పొందిన రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

By :  Eha Tv
Update: 2024-07-20 04:01 GMT

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం తొలి విడ‌త‌ రైతు రుణ మాఫీ చేసింది. ల‌బ్ధి పొందిన రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అయితే బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ రుణ మాఫీపై ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గా రెడ్డి స్పందించారు. రుణమాఫీతో బీజేపీ,BRS వాళ్లకు నిద్రపట్టడం లేదన్నారు. కొందరు బీజేపీ, BRS నేతలు నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్ కే పనికి వస్తాడు.. పనికి పనికిరాడన్నారు. రైతులకు ఒకే సారి రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందుకే లక్ష.. లక్షన్నర.. రెండు లక్షలు అన్న విడతలు పెట్టామ‌న్నారు.

హరీష్ రావు మంత్రిగా, కేసీఆర్‌ సీఎంగా ఉండి.. పది ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. అందులో రైతుల రుణమాఫీ చేసింది కేవలం 26 వేల కోట్లు మాత్రమేన‌న్నారు. బీజేపీ పదేళ్లు కేంద్రంలో ఉండి దేశంలో ఉన్న రైతులకు ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా అని కేంద్ర‌మంత్రులు బండి సంజయ్.. కిషన్ రెడ్డిలను ప్ర‌శ్నించారు. పదేళ్లలో నీర‌వ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి పది మందికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు తెచ్చి.. రైతు హత్యలు చేసింది. దీనిపై చర్చకు వస్తారా అని స‌వాల్ విసిరారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవిపై కూడా జ‌గ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల పక్షాన అన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. ఢిల్లీలో రైతులు నిరసనలు చేస్తుంటే చిరంజీవి ఎందుకు మద్దతు తెలుపలేదు.. చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్ అని అన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తుంటే.. రైతుల బాధ‌ల‌ గురించి ఆయ‌న‌కు ఎందుకు చెప్పలేకపోయార‌న్నారు. ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే.. రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారని అన్నారు. రైతుల పేరుతో సినిమాలు తీసి.. కోట్లు సంపాదించుకుని బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమ‌ర్శించారు.

Tags:    

Similar News