KTR : జనంలో తిరిగే కేతిరెడ్డి ఓడిపోయాడు.. డబ్బు సంచులతో దొరికినవాళ్లు సీఎం అయ్యారు
ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందని.. మా వైఖరి మార్చుకోవాలని.. ప్రజలది తప్పు అనడమంటే.. మాది తప్పు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందని.. మా వైఖరి మార్చుకోవాలని.. ప్రజలది తప్పు అనడమంటే.. మాది తప్పు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచామని.. అభివృద్ధిని మేము చెప్పుకోలేదు. టీఆర్ఎస్ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదన్నారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదన్నారు. పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు.
ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం.. డబ్బు సంచులతో దొరికినవాడు సీఎం అవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. జగన్ ను ఓడించేందుకు షర్మిల ను ఒక వస్తువులా ఉపయోగించారు. అంతకు మించి షర్మిల వద్ద ఏమీ లేదన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు. ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదన్నారు. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు.