Rain : వర్షంతో నిద్ర‌లేచిన హైదరాబాద్.. నేడు న‌గ‌రంలో ఎల్లో అల‌ర్ట్‌..!

హైదరాబాద్ వాసులను ఉద‌య‌మే వ‌ర్షం ప‌ల‌క‌రించింది. నగరంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ ఇదివ‌ర‌కే హెచ్చ‌రించింది

By :  Eha Tv
Update: 2024-07-20 03:09 GMT

హైదరాబాద్ వాసులను ఉద‌య‌మే వ‌ర్షం ప‌ల‌క‌రించింది. నగరంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ ఇదివ‌ర‌కే హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర వాసులు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సివుంది. ఐఎండీ.. హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్, రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ‌ అంచనా వేసింది. అయితే హైదరాబాద్ ఎల్లో అలర్ట్ మాత్రం ఈరోజు మాత్రమే. ఈరోజు హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News