ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణ(Telangana)లో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్‌లో జరిగిన 2019 ఎంబీబీఎస్(MBBS) విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్(KTR), పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు. తన చిన్నతనంలో మా అమ్మ కూడా తనని డాక్టర్ కావాలని కోరుకుంది. 1993లో రాష్ట్రంలో తనకు 1600 ర్యాంక్ రావడంతో బీ-ఫార్మసీ సీటు వచ్చింది. దీంతో కర్నాటకలో నిర్వహించే కేసెట్‌లో పాల్గొంటే తనకు మెడిసిన్‌లో సీటు వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని తన తల్లితో చెప్తే సంతోష పడిందని అన్నారు. ఆ తర్వాత తన సీటు విషయం కేసీఆర్‌తో చెప్తే ఇప్పుడు ఐదున్నరేళ్లు మెడిసిన్ చదవాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలి, తర్వా త సూపర్ స్పెషాలిటీ చదవాలి. 30-31 ఏళ్ల వరకు చదవాలి, ఆ తర్వాత పేషెంట్లకు సర్వీస్ చేసేందుకు రెడీ కావాలని.. ఎప్పుడు ఫోన్ వచ్చినా సిద్ధంగా ఉండాలని అందుకు నువ్వు రెడీ ఉన్నావా అని కేసీఆర్ తనను అడిగనట్లు కేసీఆర్ చెప్పారు. వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని అందుకు సిద్ధంగా ఉన్నావా అని కేసీఆర్ ప్రశ్నించడంతో.. ఒక్క నిమిషం ఆలోచించి ఇంత చేయాలా అనుకొని తాను సిద్ధంగా లేనట్లు చెప్పి.. పారిపోయి డిగ్రీలో జాయిన్ అయినట్లు కేటీఆర్ వెల్లడించారు.
