V Hanumantha Rao : నాకు అన్యాయం జరిగింది.. సీఎం యువ‌కుడు.. అందుకే యువకులను ప్రోత్సహించాలి

రాజ్యసభకు నాకు అవకాశం ఇస్తే బాగుంటదని.. ఎనిమిది ఏండ్లలో నాకు ఒక్క పదవి లేదని మాజీ ఎంపీ వి హనుమంత రావు అన్నారు.

By :  Eha Tv
Update: 2024-07-10 07:13 GMT

రాజ్యసభకు నాకు అవకాశం ఇస్తే బాగుంటదని.. ఎనిమిది ఏండ్లలో నాకు ఒక్క పదవి లేదని మాజీ ఎంపీ వి హనుమంత రావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నుంచి నాకు ఎంపీ టికెట్ వస్తే గెలిచే వాడినన్నారు. టికెట్ విషయంలో నాకు అన్యాయం జరిగిందన్నారు. ఈరోజు తెలంగాణకు కురియన్ కమిటీ వస్తుంది. కమిటీ ముందుగా సునీల్ కనుగోలును కలవనుంద‌ని తెలిపారు.

T-20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా టీం కు వీహెచ్‌ శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ సభ్యుడు సిరాజ్ మన హైదరాబాద్ వ్యక్తి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్లాట్, ఉద్యోగం ఇస్తానన్నాడు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు..గతంలో అతని ప్రతిభ ను చూసి సీఎఫ్ఐ ఛైర్మెన్ గా నేను సన్మానించాను. దేశం లో క్రికెట్ కు మంచి క్రేజీ ఉందన్నారు. అయితే.. తెలంగాణలో హైదరాబాద్ లో తప్ప ఎక్కడ క్రికెట్ స్టేడియం లేదు.. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. స్టేడియానికి ప్రతి జిల్లాలో 12 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డి కి విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహించాలి. ఆయన కూడా యువకుడు.. అందుకే.. యువకులను ప్రోత్సహించాలన్నారు.

కేసీఆర్ స్పోర్ట్స్ ని ప్రోత్సహించలేదు.. ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీలో సమావేశాలలో క్రీడలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల ఋణమాపి చేస్తున్నాడు. అందుకు ఆయనకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News