నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అయిష్టంగా ఉన్నారని తెలుస్తోంది.

నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు అయిష్టంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కాలేజ్ యాజమాన్యాలను తమ ఉద్యోగులను ఉపయోగించుకొని స్కూళ్లలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను తమ కాలేజీల్లో చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తాయి. వారి వివరాలు తెలుసుకొని తల్లిదండ్రుల వద్దకు పంపించి తమ కాలేజీలో చేరితే ఇంత డిస్కౌంట్ ఇస్తామని వారిని ప్రోత్సహిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ కాలేజీల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాజమాన్యాలు వారి టార్గెట్‌ను చేరుకోలేకపోతున్నాయట. ఇందుకు కారణాలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు, టెస్టులు, హోంవర్క్‌తో విద్యార్థులకు సమయం ఉండదు. చాలా మందికి ఈ ఒత్తిడి తట్టుకోవడం కష్టం. ఆటలు, స్నేహితులతో గడపడం, హాబీలకు సమయం దొరకదు. ఇది వాళ్లను మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. ర్యాంకులు, మార్కుల కోసం అందరితో పోటీ పడాలి. ఈ ఒత్తిడిలో ఓడిపోతామనే భయం కొంతమందిలో ఉంటుంది.హైదరాబాద్(Hyderabad)లోని నారాయణ(Narayana) కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వంటివి విద్యార్థుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. అధిక ఫీజులు: ఈ కాలేజీల్లో ఫీజులు చాలా ఎక్కువ. ఫీజు కట్టలేకపోతే విద్యార్థులను వేధించడం, బయటకు పంపడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారని, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని తల్లిదండ్రులు భయపడుతున్నారు. చదువుతో పాటు హాస్టల్, ట్రాన్స్‌పోర్ట్, ఇతర ఖర్చులు కలిపితే ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. కొన్ని కాలేజీల యాజమాన్యం విద్య కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తుందనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉంది. ఈ కాలేజీలు IIT, NEET వంటి పోటీ పరీక్షలకు తయారు చేపిస్తామని చెప్పినా, అందరికీ ఆ లక్ష్యం సాధ్యం కాదు. చాలా మంది విద్యార్థులు మధ్యలోనే వదిలేస్తారు లేదా మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ కాలేజీల వాతావరణం అందుకు భిన్నంగా ఉంటుందని ఫీలవుతారు.
నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కాలేజీల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వరనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ కాలేజీల లక్ష్యం IIT, NEET, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో ర్యాంకులు, హై పర్సంటేజ్ సాధించడం. దీని కోసం రోజంతా క్లాసులు, టెస్టులతో షెడ్యూల్ నడుస్తుంది. క్రీడలకు సమయం కేటాయించడం అంటే వాళ్లకు "టైం వేస్ట్" లా భావిస్తారంట. చాలా బ్రాంచ్‌లలో సరైన గ్రౌండ్స్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఉండవు. ఉన్నా, వాటిని ఉపయోగించే అవకాశం విద్యార్థులకు ఇవ్వరు. "స్పోర్ట్స్ డే అని ఒకటి పెడతారు కానీ అది కూడా పేరుకి మాత్రమే. అసలు పాల్గొనే ఛాన్స్ ఇవ్వరు, లేదా చదువు మీద ఒత్తిడి వల్ల ఆసక్తి పోతుందనేది విద్యార్థుల భావన. ఈ కాలేజీలు విద్యార్థుల ఆల్-రౌండ్ డెవలప్‌మెంట్‌కి దూరంగా ఉంటాయని తల్లిదండ్రులు ఫీలవుతారు. క్రీడలు, ఆరోగ్యం, సామాజిక నైపుణ్యాలు వంటివి దాదాపు నిర్లక్ష్యం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
"నారాయణ, శ్రీ చైతన్యలో పిల్లలు రోబోల్లా తయారవుతారు, స్పోర్ట్స్ అంటే ఏంటో కూడా తెలీదు" అని సెటైర్లు కూడా వేస్తారు. వీటన్నిటి వల్ల క్రీడలు, ఫిజికల్ యాక్టివిటీస్‌కి ఇష్టపడే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఈ కాలేజీలకు దూరంగా ఉండాలని అనుకుంటారు.
