Jagga Reddy : కేటీఆర్‌.. రేవంత్ రెడ్డికి కేసీఆర్ సవాల్ విసిరితే బాగుంటుంది

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఆగస్టు 15 వరకు పూర్తి రుణమాఫీ జరుగుతుంది అన్నారు.. మొదట లక్ష రూపాయల రుణమాఫీ చేశారు.

Update: 2024-08-18 04:19 GMT

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. ఆగస్టు 15 వరకు పూర్తి రుణమాఫీ జరుగుతుంది అన్నారు.. మొదట లక్ష రూపాయల రుణమాఫీ చేశారు. రెండవ సారి లక్షన్నర లోపు రుణం ఉన్నవాళ్లకు మాఫీ అయ్యింది. పదేళ్లలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాము అనే అసంతృప్తి.. మనోవేదన తో కేటీఆర్,హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు. రెండు లక్షల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి చేశాక.. ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రుణమాఫీతో రైతాంగం మొత్తం హ్యాపీ గా ఉందన్నారు.

పదేళ్లలో మనం చేయలేక పోయాం అనే.. టెన్షన్ లో BRS ఉంది. తెలంగాణ ప్రజలు అణిచివేతను సహించరు. అందుకే ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. పదేళ్లలో విడుదల వారీగా కూడా రుణమాఫీ చేయలేకపోయారు. కానీ ఎనమిది నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారు.. దీనిమీద విమర్శలా..? అని నిప్పులు చెరిగారు. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాకపోతే.. ప్రత్యేకంగా దరఖాస్తులు చేసుకుంటే రుణమాఫీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ వస్తాను అని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి.. కేసీఆర్ సవాల్ చేస్తే బాగుండేది.. మీరు కాదు. మీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్.. నేను వర్కింగ్ ప్రెసిడెంట్. సిరిసిల్ల, సిద్దిపేట ఎక్కడికి రమ్మంటోరో చెప్పండి.. లేదు అనుకుంటే మా మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి లలో ఎవరినైనా రిక్వెస్ట్ చేసి తీసుకువస్తా.. రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామ‌ని స‌వాల్ విసిరారు. అధికారం పోగానే.. మా ప్రభుత్వ పథకాలు చూసి తెగిన గాలిపటంలా మారింది హరీష్ రావు, కేటీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

హరీష్ రావు ఆఫీస్ మీద కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు.. మా హాయంలో ఇలాంటివి జరగలేదు అని ఆయన అంటున్నారు.. పదేళ్లలో ప్రజలు, ఉద్యోగులు, రైతులు, మహిళలు తమ బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు. ఎంత దుర్మార్గమైన పాలన అందించారు. ధర్నా చౌక్ లేకుండా చేశారు.. నిరసనలు చేసుకునే స్వేచ్ఛ లేకుండా పాలన చేశారు. ఆ రోజులు హరీష్ రావు మర్చిపోయారా.. ఇదంతా మీ సంప్రదాయం కదా.. అని నిల‌దీశారు. మీరు చేసినదాంట్లో కాంగ్రెస్ శ్రేణులు చేసింది గోరంత. కాంగ్రెస్ శ్రేణులు జస్ట్ ఝలక్ ఇచ్చారు అంతేన‌న్నారు.

సిద్దిపేటలో ఒక పోలీస్ స్టేషన్ అత్యంత భయానక పరిస్థితి ఉండే.. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను చిత్రహింసలు చేసేవారు. నేరెళ్ళ దళితులను సంసారాలకు పనికిరాకుండా కొట్టారు. కొందరు పోలీసులు కట్టెలు విరిగేలా కొట్టారు.. సిగ్గు శరం లేకుండా ఎలా కోడతారు. హరీష్ రావు ఏజెంట్ గా అప్పటి సీఐ సురేందర్ మదమెక్కిపని చేశాడు.. రేయ్ నీ సంగతి చెబుతా.. అని అప్పుడే చెప్పా.. ఆసిఫాబాద్ డీఎస్పీ గా ఇప్పుడు సురేందర్ రెడ్డి పని చేస్తుండు.. మెజారిటీ పోలీసులు ఉన్నారు కాబట్టే శాంతి భద్రతలు ఉన్నాయన్నారు. 

Tags:    

Similar News