చూడబోతే మన హైదరాబాద్‌(Hyderabad) కూడా ఢిల్లీ(Delhi) మాదిరిగా డేంజరస్‌గా తయారవుతున్నట్టుగా అనిపిస్తోంది.

చూడబోతే మన హైదరాబాద్‌(Hyderabad) కూడా ఢిల్లీ(Delhi) మాదిరిగా డేంజరస్‌గా తయారవుతున్నట్టుగా అనిపిస్తోంది. నగర వాతావరణం(City environment) రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్నది. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నాణ్యతను(Air quality) దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నిర్ణీత పరిమాణాన్ని దాటిపోతున్నది. కొన్ని ప్రాంతాల్లో పీల్చే గాలిలో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉండటం భయాందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(Air quality Index) నివేదిక ప్రకారం పరిశ్రమలు విస్తరించిన కూకట్‌పల్లి, మూసాపేట్‌, బాలానగర్‌తో పాటు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో గాలి కాలుష్య కారకాలు ప్రమాదకరంగా మారినట్లుగా తేలింది. ఆదివారం పలు ప్రాంతాల్లో నమోదైన ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఏకంగా 300 దాటింది. హైదరాబాద్‌లో పరిస్థితి చేజారక ముందే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని, కాలుష్య కారకాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేటెస్ట్ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఏడో స్థానంలో ఉందని వెల్లడైంది. మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా, నిత్యం ట్రాఫిక్‌ రద్దీ ఉండే బెంగళూరు, చెన్నై నగరాలు హైదరాబాద్‌ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం.

Eha Tv

Eha Tv

Next Story