☰
✕
హైదరాబాద్(Hyderabad) లో చలి(Cold wave) ఒక్కసారిగా పెరిగింది.
x
హైదరాబాద్(Hyderabad) లో చలి(Cold wave) ఒక్కసారిగా పెరిగింది. ఉష్ణోగ్రతలు(Temperature) సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతున్నాయి. గ్రేటర్‌లో చలి తీవ్రత రోజురోజుకు తీవ్రమవుతున్నది. నగర శివారు ప్రాంతాల్లో ఉదయం మంచు కురుస్తున్నది. పగటి పూట కూడా చలి ఉంటున్నది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠం 2.2 తగ్గి 28.8 డిగ్రీలు నమోదయ్యింది
రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.3 తగ్గి 15.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. , గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. నగర శివారు ప్రాంతాలైన పటాన్‌చెరులో రాత్రి ఉష్ణోగ్రతలు 12.4, రాజేంద్రనగర్‌లో 14, హకీంపేటలో 15.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిపారు.
Eha Tv
Next Story