KCR : జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌పై సుప్రీంలో కేసీఆర్ పిటిషన్.. రేపు విచారణ
విద్యుత్ కొనుగోలుపై మునుపటి BRS ప్రభుత్వం చేసిన ఒప్పందాలు, రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
విద్యుత్ కొనుగోలుపై మునుపటి BRS ప్రభుత్వం చేసిన ఒప్పందాలు, రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్ జాబితా ప్రకారం.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై జూలై 15న విచారణ చేపట్టనుంది.
అంతకుముందు.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను కోరుతూ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున స్పందించేందుకు మరింత సమయం కావాలని కోరారు. అయితే.. మాజీ సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వకముందే జూన్ 15న జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం, ఏకపక్షం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, భారత రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్‌లను ఉల్లంఘించడమేనని.. కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఆరోపణలను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జుకంటితో కూడిన డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.