Telangana : రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వ‌ర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2024-08-19 03:17 GMT

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఐఎండీ రానున్న నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసినప్పటికీ హైదరాబాద్‌కు మాత్రం అది వర్తించదు. ఇప్పటి వరకు ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సగటు వర్షపాతం 489.6 మి.మీ.కు గాను 556.7 మి.మీ.. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 388.6 మిల్లీమీటర్లకు గానూ 412.6 మిమీ నమోదైంది. IMD హైదరాబాద్ అంచనా వేసిన ఈ నాలుగు రోజుల వర్షపాతం.. ప్రస్తుత నైరుతి రుతుపవనాల ద్వారా కురిసిన‌ మొత్తం వర్షపాతాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News