HYDRAA : చట్ట ప్రకారమే 'ఎన్ కన్వెన్షన్' లోని కట్టడాలను కూల్చివేశాం

సినీ హీరో నాగార్జున‌కు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చేతలపై హైడ్రా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది

Update: 2024-08-24 12:49 GMT

సినీ హీరో నాగార్జున‌కు చెందిన 'ఎన్ కన్వెన్షన్' కూల్చేతలపై హైడ్రా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ లోని కట్టడాలను కూల్చివేశామ‌ని హైడ్రా కమిషనర్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని.. హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవమ‌ని హైడ్రా వెల్ల‌డించింది. ఎఫ్టీఎల్‌లో కట్టడాలు ఉన్నందునే కూల్చి వేయడం జరిగిందని.. చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని.. హైడ్రా చట్ట ప్రకారం వ్యవహరించి కట్టడాలని కూల్చివేసింద‌ని తెలిపారు. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందన్నారు. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ ను అధికారులు గతంలోనే తిరస్కరించారని.. ఎన్ కన్వెన్షన్ పైన ఇప్పటికే లోకా యుక్తతో పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయని ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది. ఎన్ కన్వెన్షన్‌లో పూర్తిగా అన్ని కట్టడాలను నేలమట్టం చేశామ‌ని.. ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం జీరో గా మారిందని తెలిపారు. 

Tags:    

Similar News