Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కన్నుమూత‌

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. జిల్లాలోని ఉట్నూర్‌లోని తన స్వగృహంలో అస్వ‌స్థ‌త‌కు గురైన రాథోడ్‌ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

By :  Eha Tv
Update: 2024-06-29 10:42 GMT

ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. జిల్లాలోని ఉట్నూర్‌లోని తన స్వగృహంలో అస్వ‌స్థ‌త‌కు గురైన రాథోడ్‌ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ రాథోడ్ పరిస్థితి విషమించడంతో.. వైద్యులు ఆయ‌న‌ను హైదరాబాద్‌కు రిఫ‌ర్ చేశారు, అయితే ఆయ‌న‌ను త‌ర‌లించేలోగా మార్గ‌మ‌ధ్యంలో మరణించినట్లు కుటుంబ స‌భ్యులు ప్రకటించారు.

నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాథోడ్ బీజేపీ టిక్కెట్‌పై ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 52,398 ఓట్ల సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆయ‌న‌ 2024 మేలో ఆదిలాబాద్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు కానీ పార్టీ ఆయ‌న‌కు టిక్కెట్ నిరాకరించింది.

రాథోడ్ మరణం ప‌ట్ల కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. రాథోడ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాథోడ్ 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాథోడ్ 1999లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. రాథోడ్ హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News