N Convention : నాగార్జునకు షాకిచ్చిన 'హైడ్రా'.. ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం

హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా శ‌నివారం ఉద‌యం కూల్చి వేయడం ప్రారంభించింది

Update: 2024-08-24 03:29 GMT

హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా శ‌నివారం ఉద‌యం కూల్చి వేయడం ప్రారంభించింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల‌పైనా కొత్తగా ఏర్పాటు అయిన హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన హైడ్రా సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో కన్వెన్షన్ నిర్మించారని నిర్ధారించుకుంది. ఈ మేరకు ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేత‌ హైడ్రా ప్రారంభించింది.

కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించి గత దశాబ్ద కాలంగా నాగార్జున అక్కడ వ్యాపారం చేస్తున్నారు. గతంలో కూడా ఆరోపణలు వచ్చినప్పటికీ.. గత ప్రభుత్వాలు ఎన్ కన్వెన్షన్ వైపు కన్నెత్తి చూడలేదు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత చెరువుల‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపైన ఫోకస్ పెట్టింది.. ఈ నేపథ్యంలోనే న‌గ‌రంలో ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన దాదాపు అక్ర‌మ నిర్మాణాల‌న్నింటినీ కూల్చివేసింది. అదే తరహాలో మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను కూడా కూల్చివేత ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. కబ్జాల‌కు గురైన చెరువులు, కుంటలు, నాళాలపై నిర్మించిన నిర్మాణాల‌పై ఫోకస్ పెట్టింది. 

Tags:    

Similar News