Pawan Kalyan : రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌... షెడ్యూల్‌ ఇదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు.

By :  Eha Tv
Update: 2024-06-28 09:42 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి(AP Deputy CM ), జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) శనివారం జగిత్యాల(Jagtial)లోని కొండగట్టు ఆంజనేయ స్వామి(Kondagattu Anjaneya Swamy)ని దర్శించుకోనున్నారు. వారాహి అమ్మవారి దీక్ష(Varahi Ammavari Deeksha)లో ఉన్న పవన్‌ కల్యాణ్‌ శనివారం ఉదయం ఏడు గంటలకు మదాపూర్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. గంటన్నరపాటు పుణ్యక్షేత్రంలోనే పవన్‌ ఉంటారు. స్వామి ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కొండగట్టు నుంచి మాదాపూర్‌కు రోడ్డు మార్గంలో తిరిగి వస్తారు. సాయంత్రం నాలుగున్నరకు మాదాపూర్‌కు చేరుకుంటారు. శనివారం రాత్రం హైదరాబాద్‌(Hyderabad)లోనే పవన్‌ బస చేయనున్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్‌ ఘన విజయం సాధించారు. ఆయన పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించింది. దీంతో ఆయన ఈ నెల 26వ తేదీన వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్టగా ఈ దీక్షను పాటించనున్నారు. కాకపోతే దీక్ష దుస్తుల్లో ఉన్న పవన్‌ చెప్పులు వేసుకుని కనిపించడమే చర్చనీయాంశంగా మారింది.రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌... షెడ్యూల్‌ ఇదే..!

Tags:    

Similar News