Hyderabad : 28న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సెప్టెంబరు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
By : Sreedhar Rao
Update: 2024-09-26 15:00 GMT
సెప్టెంబరు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం ప్రకటన ప్రకారం.. ప్రజలు ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల మధ్య దిగువ మార్గాలలో ట్రాఫిక్‌పై సమాచారమిచ్చింది.
బేగంపేట, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పిఎన్‌టి జంక్షన్, రసూల్‌పురా, సిటిఒ జెఎన్., ప్లాజా, టివోలి, సికింద్రాబాద్ క్లబ్, కార్ఖానా, త్రిముల్‌గేరీ క్రాస్ రోడ్‌లు, లోత్‌కుంట, బొల్లారం, రాష్ట్రపతి నిలయం పరిసర జంక్షన్‌లకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఉంటుందని వెల్లడించింది.
ఈ మార్గాలలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాల ద్వారా వాహనాల రాకపోకలను సాగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పేర్కొంది.