Cricket : ద్రావిడ్ నిద్ర‌పోయాడు.. రోహిత్ ఎవ‌రినో తిట్టాడు.. బార్బడోస్-ఢిల్లీ విమానంలో ఏం జ‌రిగింది.?

జూన్ 29న బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది.

By :  Eha Tv
Update: 2024-07-31 04:08 GMT

జూన్ 29న బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది. అయితే, బార్బడోస్ తీరంలో బెరిల్ తుఫాను విధ్వంసం సృష్టించడంతో టీమిండియా భారతదేశానికి తిరిగి రావడం మూడు రోజులు ఆలస్యం అయింది. భారత జట్టు 2013 తర్వాత తొలిసారిగా ICC టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో పాటు రెండుసార్లు T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఏకైక జట్టుగా భార‌త్‌ నిలిచింది. ఐసిసి ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌లను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ నిలిచింది.

భారత ఆటగాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు బీసీసీఐ BCCI AIC24WC అనే పేరుతో చార్టర్డ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది, ఇది టీమ్ ఇండియా ఆటగాళ్లను మాత్రమే కాకుండా భారతీయ జర్నలిస్టులను, స్టార్ స్పోర్ట్స్ ప్ర‌తినిధుల‌ను విండీస్ నుంచి ఇండియాకు తీప‌సుకొచ్చింది. బార్బడోస్ నుంచి బ‌య‌లుదేరిన‌ విమానం 16 గంటల సుదీర్ఘ‌ ప్ర‌యాణం పూర్తి చేసుకుని జూలై 4న ఢిల్లీకి చేరుకుంది.

ఆ స‌మ‌యంలో బృందంతో ప్రయాణిస్తున్న స్టార్ స్పోర్ట్స్ ప్ర‌తినిధి.. ఆ స‌మ‌యంలో జట్టు మానసిక స్థితితో సహా కొంత ఆసక్తికరమైన సమాచారాన్ని పంచుకున్నారు. రాహుల్ ద్రవిడ్ బిజినెస్ క్లాస్ నుండి ఎకానమీ క్లాస్‌కి ఎందుకు మారాడో కూడా వివరించాడు.

"బార్బడోస్ నుండి ఢిల్లీకి బ‌య‌లుదేరిన‌ విమానంలో ఎవరూ ఆరు గంటల కంటే ఎక్కువ నిద్రపోలేదు. ఎవరూ ఆ సమయంలో నిశ్శబ్దంగా లేరు. అందరూ ఒకరినొకరు కలుసుకుంటున్నారు. స్పోర్ట్స్ ప్రెస్ సభ్యులు, ఇతర వ్యక్తులు విమానంలో ఉన్నారు. విమానంలో చాలా సంభాషణలు జరిగాయి. రోహిత్ శర్మ చాలాసార్లు బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీ క్లాస్‌కు వచ్చాడు. రాహుల్ ద్రవిడ్ నిద్రపోవాలనుకుని 4-సీటర్ ఉందా లేదా అని బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీ విభాగానికి వచ్చారు. ఆయ‌న కొంతసేపు అక్క‌డ‌ పడుకున్నారు. రోహిత్ శర్మ ఎవరినో తిట్టడం తాను చూశానని.. అయితే అతను సరదాగా మాట్లాడుతున్నాడని అర్ధ‌మైంది. నేను నిద్రపోతున్నా.. ఆ స‌మ‌యంలో ఒక్కసారిగా ఎవరినో తిట్టిన రోహిత్ గొంతు వినిపించింది. వెంట‌నే చూశాను.. కానీ రోహిత్ మాత్రం తనదైన శైలిలో సరదాగా తిట్టాడు. ఆ తర్వాత హార్దిక్, రిషబ్ వచ్చి చర్చలు జరిపారు. అలా విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లేకుండా విమానంలో సందడి వాతావరణం నెల‌కొంద‌ని పేర్కొన్నాడు. 

Tags:    

Similar News