ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రీతిజింటా (Preity Zinta)మామూలు హడావిడి చేయలేదు.

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రీతిజింటా (Preity Zinta)మామూలు హడావిడి చేయలేదు. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చహల్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో సంతోషంతో ప్రీతి చాహెల్‌కు టైట్ హగ్‌ సుఖాన్ని ఇచ్చింది. చండీగష్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్‌లో జరిగింది. పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది ఐపీఎల్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్. యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal)4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు అజింక్య రహానె 17, అంగ్‌క్రిష్ రఘువంశీ 37, రింకూ సింగ్ 2, రామన్‌దీప్ సింగ్ 0 తీశాడు. దీంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. 95 పరుగులకే ఆలౌట్ అయ్యారు, దీంతో పంజాబ్ 16 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అయిన తర్వాత, పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా ఆనందంతో మైదానంలోకి వచ్చి చహల్‌తో మాట్లాడి, అతనికి గట్టి హగ్‌ ఇచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందజేసింది. మ్యాచ్ తర్వాత, చహల్ తన ఆట విధానం గురించి మాట్లాడుతూ, “మేము పవర్‌ప్లేలో 2-3 వికెట్లు తీస్తే మంచిదని అనుకున్నాం. నా తొలి బంతి స్పిన్ అయ్యింది, ఇదే దాడిని కొనసాగించాం. గత మ్యాచ్‌లో నేను 4 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చాను, కానీ నా సామర్థ్యంపై నమ్మకంతో ఈ రోజు బౌలింగ్ చేశాను.” అని చాహెల్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story