Paris Olympic Day 11 Schedule : 44 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్‌కు వెళ్లాల‌ని హాకీ జ‌ట్టు.. మ‌రో స్వ‌ర్ణం కోసం నీర‌జ్ చోప్రా..

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేదు. నేడు ఆట‌ల‌కు 11వ రోజు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత, భారత ఆటగాడు నీరజ్ చోప్రా నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో పాల్గొన‌నున్నాడు.

Update: 2024-08-06 01:38 GMT

క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో పాల్గొన‌నున్నాడు. అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నేడు భారత పురుషుల హాకీ జట్టు(Indian Hockey Team) సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడ‌నుంది. మూడుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ జర్మనీ(Germany)తో నేడు భార‌త్ మ్యాచ్‌లో తలపడుతుంది. 1980 ఒలింపిక్స్‌ తర్వాత తొలిసారిగా ఫైనల్‌కు చేరి పతకం సాధించాలని భారత జట్టు ప్రయత్నిస్తోంది. ఒక‌వేళ సెమీస్‌(Semis)లో ఓడిపోతే భారత్‌ కాంస్య పతకం కోసం ఆడాల్సి ఉంటుంది.

భారత మహిళల టేబుల్ టెన్నిస్(Table Tennis) జట్టు క్వార్టర్ ఫైనల్(Quarter Final) చేరి చరిత్ర సృష్టించిన తర్వాత.. ఇప్పుడు భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు వంతు వచ్చింది. శరత్ కమల్(Sharat Kamal), హర్మీత్(Harmeeth), మానవ్‌(Manav)లు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓటమిని మరిచిపోయి సరికొత్త శుభారంభం చేయాలనుకుంటున్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో మంగళవారం 11వ రోజు పోటీల్లో భారత్ షెడ్యూల్ ఇలా ఉంది..

టేబుల్ టెన్నిస్:

పురుషుల జట్టు (ప్రీ-క్వార్టర్ ఫైనల్): భారత్ (హర్మీత్ దేశాయ్, శరత్ కమల్ మరియు మానవ్ ఠక్కర్) Vs చైనా: మధ్యాహ్నం 1.30

అథ్లెటిక్స్‌

పురుషుల జావెలిన్ త్రో (అర్హత): కిషోర్ జెనా: మధ్యాహ్నం 1.45 నుంచి

పురుషుల జావెలిన్ త్రో (అర్హత): నీరజ్ చోప్రా: మధ్యాహ్నం 3.20 నుంచి

మహిళల 400మీ (రెపీచేజ్): కిరణ్ పహల్: మధ్యాహ్నం 2.50 నుంచి.

రెజ్లింగ్

ఫ్రీస్టైల్ 50 కిలోల బరువు విభాగం (ప్రీ క్వార్టర్ ఫైనల్): వినేష్ ఫోగట్: మధ్యాహ్నం 3 గంటల నుంచి

హాకీ:

పురుషుల సెమీఫైనల్: భారత్ vs జర్మనీ: రాత్రి 10.30 నుండి.

Similar News