Sajjan Jindal : ఒలింపిక్ ప‌త‌కం గెల‌వండి.. కారు బ‌హుమ‌తిగా పొందండి..!

పారిస్ ఒలింపిక్స్ 2024 జ‌రుగుతూ ఉన్నాయి. ఈ పోటీల‌లో భారత్‌కు ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు వ‌చ్చాయి.

Update: 2024-08-02 06:30 GMT

పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడ‌లు జ‌రుగుతూ ఉన్నాయి. ఈ పోటీల‌లో భారత్‌కు ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు వ‌చ్చాయి. ఇదిలావుంటే.. JSW గ్రూప్ ఛైర్మన్ MD సజ్జన్ జిందాల్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ప్రతీ ఒలింపిక్ పతక విజేతను రాబోయే MG విండ్సర్ EVతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.ఆయ‌న X లో "అథ్లెట్లు వారి అంకితభావానికి, విజయానికి అర్హులు" అని రాశారు. ప్రతి ఒలింపిక్ పతక విజేతకు JSW ఇండియా త‌రుపున‌ అద్భుతమైన కారు MG విండ్సర్ బహుమతిగా ఇవ్వనున్నామ‌ని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. జిందాల్ పోస్ట్ పై నెటిజన్లు ఆయ‌న‌ చొరవను ప్రశంసించారు.

MG మోటార్ ఇండియా రాబోయే త‌మ కారు ఆల్-ఎలక్ట్రిక్ క్రాసోవర్‌కి విండ్సర్ EV అని పేరు పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది కంపెనీకి చెందిన‌ మూడవ ఎలక్ట్రిక్ వాహనం. దీనికి ముందు ZS EV, కామెట్ EVలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఎలక్ట్రిక్ కారులో లగ్జరీ, యుటిలిటీ కోసం చూస్తున్న వ్యక్తులకు ఇది మంచి ఎంపికగా చెబుతున్నారు. ధర పరంగా ఇది కామెట్, ZS EV మధ్యస్థంగా ఉండ‌నుంది. సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.15 నుంచి 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. భారతీయ మార్కెట్లో ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 వంటి ఎలక్ట్రిక్ SUVలతో నేరుగా పోటీపడనుంది.

Tags:    

Similar News