Women's Asia Cup : జూలై 19న పాక్‌తో తలపడనున్న భారత్.. ఫ్యాన్స్‌కు ఉచిత ప్రవేశం
శ్రీలంకలో దంబుల్లా వేదికగా జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూలై 19న ఆడనుంది
శ్రీలంకలో దంబుల్లా వేదికగా జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూలై 19న ఆడనుంది. అదే రోజు ఆతిథ్య శ్రీలంక బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ శుక్రవారం ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, మలేషియా జట్లు కూడా పాల్గొంటాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్, ఫైనల్ రెండూ కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లు అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ప్రేక్షకులకు స్టేడియంలోకి ఉచిత ప్రవేశం ఇవ్వబడుతుందని శ్రీలంక క్రికెట్ తెలిపింది.