IND vs ZIM : చివరి మ్యాచ్‌లోనూ అద‌ర‌గొట్టిన కుర్రాళ్లు.. 4-1తో సిరీస్ కైవ‌సం

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.

By :  Eha Tv
Update: 2024-07-15 03:08 GMT

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఆదివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 18.3 ఓవర్లలో 10 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన శివమ్ దూబే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. సిరీస్‌లో అత‌డు 28 పరుగులు చేసి.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన జింబాబ్వేకు శుభారంభం లభించలేదు. ముఖేష్ కుమార్ జింబాబ్వే జట్టును తొలి దెబ్బ కొట్టాడు. ఒక్క పరుగు వద్ద మాధవే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్రియాన్ బెన్నెట్ కూడా ముఖేష్ బౌలింగ్‌లో శివమ్ దూబే చేతికి చిక్కాడు. అతడు కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.

ఆ తర్వాత మారుమణి, మైయర్స్ ఇన్నింగ్సు చ‌క్క‌దిద్దే బాధ్యతలు చేపట్టారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 44 పరుగుల భాగస్వామ్యం ఏర్ప‌డ‌గా.. వీరిని సుందర్ తొమ్మిదో ఓవర్‌లో విడదీశాడు. మారుమని 27 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ గా వెపుదిరిగాడు. ఆ త‌ర్వాత‌ మైయర్స్ 34 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా ఎనిమిది పరుగులు, క్యాంప్‌బెల్ నాలుగు పరుగులు, మదండే ఒక పరుగు, మవుటా నాలుగు పరుగులు చేశారు.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌తో ఆడిన ఫరాజ్ అక్రమ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముందుగా తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాట్‌తోనూ మెరిశాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. ముఖేష్ కుమార్ 19వ ఓవర్లో అక్రమ్‌నుఅవుట్ చేశాడు. ఆ త‌ర్వాత‌ నాగరవ సున్నా, ముజారబానీ ఒక పరుగు (నాటౌట్) సాధించారు.

భారత్ తరఫున ముఖేష్ కుమార్ మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడు మాధవరే, బెన్నెట్, అక్రమ్, నగరవల వికెట్లు ప‌డ‌గొట్టాడు. శివమ్ దూబే రెండు వికెట్లు తీయగా, తుషార్, సుందర్, అభిషేక్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News