Arjun Tendulkar : యువరాజ్ సింగ్ తండ్రి కామెంట్స్ కరెక్ట్ కాదని నిరూపించిన సచిన్ తనయుడు
భారత వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ ఇటీవల సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను 'అతడు హీరో కాదు బొగ్గు' అని అన్నాడు
భారత వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ ఇటీవల సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను 'అతడు హీరో కాదు బొగ్గు' అని అన్నాడు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. అయితే ఆ మాట అర్జున్ టెండూల్కర్ వరకూ వెళ్లిందో లేదో తెలియదు కానీ.. యోగిరాజ్ సింగ్ మాట తప్పని మాత్రం నిరూపించాడు. KSCA ఇన్విటేషన్ టోర్నమెంట్‌లో అర్జున్ టెండూల్కర్ 9 వికెట్లు తీశాడు. 26.3 ఓవర్లలో 87 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు.
డాక్టర్ (కెప్టెన్) కె తిమ్మప్పయ్య స్మారక టోర్నమెంట్‌లోగోవా తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ కర్ణాటకపై 9 వికెట్లు పడగొట్టాడు. KSCA XIలో ఎక్కువగా అండర్-19, అండర్-23 ఆటగాళ్లు ఉన్నారు. అర్జున్ 2 ఇన్నింగ్స్‌లలో 26.3 ఓవర్లు వేసి 87 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక జట్టు 36.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో అర్జున్ టెండూల్కర్ 13 ఓవర్లలో 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా అభినవ్ తేజ్రానా సెంచరీ, మంథన్ ఖుత్కర్ హాఫ్ సెంచరీతో 413 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కర్ణాటక జట్టు 30.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. అర్జున్ టెండూల్కర్ 13.3 ఓవర్లు బౌలింగ్ చేసి 46 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన గురించి చెప్పాలంటే.. అతడు 13 మ్యాచ్‌లు ఆడి 20 ఇన్నింగ్స్‌లలో 21 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 24.05 సగటుతో 53.03 స్ట్రైక్ రేట్‌తో 481 పరుగులు చేశాడు. 15 లిస్ట్ A మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్‌లలో అతడు 21 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 62 పరుగులు కూడా చేశాడు. అర్జున్ 21 టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 98 పరుగులు కూడా చేశాడు.