Charmadi Waterfalls : పర్యాటకుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు... ఎందుకంటే...!
ద్వాపరంలో గోపికల చీరలెత్తుకెళ్లాడు చిలిపి కృష్ణుడు. అందుకో కారణం ఉంది. కలియుగంలో పర్యాటకుల బట్టలెత్తుకెళ్లారు పోలీసులు. ఇందుకూ ఓ కారణం ఉంది. పర్యాటక ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను టూరిస్టులు పెద్దగా పట్టించుకోరు.
ద్వాపరంలో గోపికల చీరలెత్తుకెళ్లాడు చిలిపి కృష్ణుడు. అందుకో కారణం ఉంది. కలియుగంలో పర్యాటకుల బట్టలెత్తుకెళ్లారు పోలీసులు. ఇందుకూ ఓ కారణం ఉంది. పర్యాటక ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్చరికలను టూరిస్టులు పెద్దగా పట్టించుకోరు. ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వర్షాకాలంలో జలపాతాలకింద స్నానం చేయడం ప్రమాదకరమని తెలుసు. అయినా కొందరు పర్యాటకులు ఈ పని చేస్తున్నారు. పోలీసులకు కోపం వచ్చేసి వారు జలపాతం దిగువన ఉన్న బట్టలను తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన కర్నాటక(Karnataka) ముడిగేరిలోని చార్‌మడి జలపాతం(Charmadi Waterfalls) దగ్గర జరిగింది. వద్దని చెప్పినా కొందరు అక్కడ స్నానం చేయడంతో పోలీసులు ఈ పని చేశారు. దీంతో పర్యాటకులు తమ దుస్తులు ఇచ్చేయాలంటూ అర్ధనగ్నంగా పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా సేపు బతిమాలిన తర్వాత పోలీసులు వారిని హెచ్చరించి వారి బట్టలు వారికి ఇచ్చేశారు. పోలీసులు చేసిన చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.