వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకున్నారు. ఈ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకుందాం అనుకున్నారు. ఈ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన శవం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టాడు. ఈ ఘటన తమిళనాడు(Tamil Nadu)లోని కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. కావనై గ్రామానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి సెల్వ రాజు(Selva Raju) రెండో కుమారుడు అదే ప్రాంతానికి చెందిన విజయశాంతిని ప్రేమించాడు. ఇద్దరూ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల అనుమతి కూడా తీసుకున్నారు. పెళ్లి కోసమని ఓ డేట్ ని కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే సెల్వ రాజుకు అనారోగ్యం వచ్చింది. దీంతో సెల్వ రాజు ఉండగానే ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని ప్రియురాలు ఒప్పించి ఆయన శవం ముందే ఆమెకు తాళి కట్టాడు. పుట్టడు దుఃఖంలో ఉన్నా కానీ వారిద్దరినీ రెండు కుటుంబాలు, బంధుమిత్రులు ఆశీర్వదించారు.

ehatv

ehatv

Next Story