ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు
By : Eha Tv
Update: 2024-06-15 02:05 GMT
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో, BJP మొత్తం 240 స్థానాలను కైవసం చేసుకుంది, మెజారిటీ మార్క్ 272 కంటే తక్కువగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ మిత్రపక్షాలపై ఆధారపడింది. "పొరపాటున ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఇది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు." అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కూడా మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్ జనరల్‌ను వెంటనే తొలగించాలని.. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయించాలన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వ వైఖరి బాధ్యతారాహిత్యంగా, కర్కశంగా ఉందని ఆరోపించారు. గ్రేస్ మార్కులు ఒక్కటే నీట్ పరీక్షకు సంబంధించిన సమస్య కాదన్నారు ఖర్గే. మోడీ ప్రభుత్వ చర్యల కారణంగా నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భిష్యత్తు అగమ్యగోచరమైందని అన్నారు.