Tamilnadu : క‌ల్తీ మద్యం సేవించి 30 మంది మృతి

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో క‌ల్తీ మద్యం సేవించి 30 మంది మరణించగా.. 100 మందికి పైగా ఆసుపత్రి పాల‌య్యారు.

By :  Eha Tv
Update: 2024-06-20 04:23 GMT

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో క‌ల్తీ మద్యం సేవించి 30 మంది మరణించగా.. 100 మందికి పైగా ఆసుపత్రి పాల‌య్యారు. ఈ విషయాన్ని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ ధృవీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ పరామర్శించారు.

ఈ కేసులో 49 ఏళ్ల అక్రమ మద్యం విక్రయదారుడు కె. కన్నుకుట్టిని అరెస్టు చేశారు. అతని నుండి స్వాధీనం చేసుకున్న సుమారు 200 లీటర్ల అక్రమ మద్యాన్ని పరీక్షించగా.. అందులో హానిక‌ర‌మైన‌ 'మీథేన్' ఉన్నట్లు తేలింది.

మృతుల కుటుంబాల‌కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలియ‌జేశారు. క‌ల్తీ మద్యం అరికట్టడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కల్లకురిచిలో ప్ర‌జ‌లు కల్తీ మద్యం తాగి మృతి చెందిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేశారు. అరికట్టడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి ప్రజలు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను కఠినంగా అణిచివేస్తామ‌ని సీఎం అన్నారు.  

Tags:    

Similar News