Apple iPhone : పెళ్లయిన మహిళలకు ఉద్యోగమివ్వరు..! ఎక్కడంటే ?

ఉద్యోగ నియామకాలలో పురుషులు, మహిళల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదు. 1976 నాటి సమాన వేతన చట్టం ఇదే చెబుతోంది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి.

By :  Eha Tv
Update: 2024-06-27 06:43 GMT

ఉద్యోగ నియామకాలలో పురుషులు, మహిళల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదు. 1976 నాటి సమాన వేతన చట్టం ఇదే చెబుతోంది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి. కొన్ని కంపెనీలు అయితే వివాహిత మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇలాంటివాటిలో ఐఫోన్‌లు, ఇతర యాపిల్‌ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్‌ కాన్‌ ప్లాంట్‌(Foxconn plant) కూడా ఒకటి. ఇందులోని ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందంటూ రాయిటర్స్‌ ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఓ సమగ్ర నివేదక సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెన్నై(Chennai) సమీపంలోని ఐఫోన్‌ ఫ్యాక్టరీ(iPhone Factory)లో వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్‌ బయటపెట్టడంతో తమిళనాడు కార్మిక శాఖ నుంచి ఓ నివేదికను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కోరింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్‌కాన్ యాజమాన్యాలు ఇంకా స్పందించలేదు. పెళ్లైన మహిళలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్న కారణంతోనే ఫాక్స్‌కాన్‌ వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదని రాయిటర్స్‌ గుర్తించింది. ఫాక్స్‌కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు కూడా రాయిటర్స్‌కు ఈ విషయాన్ని చెప్పాయి. కుటుంబ బాధ్యతలతో పాటు గర్భం, సెలవులు ఎక్కువగా పెట్టడం వంటి కారణంగా ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో వివాహిత మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిపాయి.

Tags:    

Similar News