NBK 109 Movie Update : అసురుడు, డెమోన్‌.. బాలయ్యకు ఏది సూటవుతుంది?

సినీ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఇప్పుడు కాసింత వెసులుబాటు దొరికింది. మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో ఉన్న బాలయ్య సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నాడు.

By :  Eha Tv
Update: 2024-06-29 07:46 GMT

సినీ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ(MLA Balakrishna)కు ఇప్పుడు కాసింత వెసులుబాటు దొరికింది. మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో ఉన్న బాలయ్య సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యారు. కె.ఎస్‌.రవీంద్ర(K. S. Ravindra) (బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Soujanya) కలిసి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌(Hyderabad)లో ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. దీనికి వీరమాస్‌ అనే టైటిల్‌ను ఖాయం చేసినట్టు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే మరో రెండు టైటిల్స్‌ను కూడా మేకర్స్‌ అనుకుంటున్నట్టు తెలిసింది. అందులో ఒకటి అసురుడు. రెండోది డెమోన్‌. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్‌ను ఖరారు చేస్తామని బాబీ అంటున్నాడు. అసురుడు అంటే రాక్షసుడు.. డెమోన్‌ అంటే భూతం. మరి ఈ రెండు పేర్లలో ఏ పేరును ఖాయం చేస్తారో. ఈ సినిమాలో బాలకృష్ణ రోల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు. విలన్‌గా బాబీ డియోల్‌ నటిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు.

Tags:    

Similar News