సమంత రెండో పెళ్లి గురించి చాలా రూమర్స్, గాసిప్స్ సోషల్ మీడియాలో, తిరుగుతున్నాయి.

సమంత రెండో పెళ్లి గురించి చాలా రూమర్స్, గాసిప్స్ సోషల్ మీడియాలో, తిరుగుతున్నాయి. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్‌లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నాయి. మరికొన్ని సోర్సెస్ ఆమె కుటుంబం రెండో పెళ్లికి ఒప్పుకుందని, మే నెలలోనే ముహూర్తం ఫిక్స్ అయ్యిందని అంటున్నాయి. కానీ, సమంత(Samantha)గతంలో ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదని, ప్రస్తుతం తన కెరీర్ మీదే ఫోకస్ చేస్తున్నానని చెప్పింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు కొన్ని ఈ రూమర్స్‌కి ఊతం ఇస్తున్నా, ఆమె నుంచి లేదా ఆమె టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సమంత, రాజ్ నిడిమోరు కలిసి ఉన్న కొన్ని ఫొటోలు, ముఖ్యంగా పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో, ఒక బర్త్‌డే బ్రంచ్‌లో తీసినవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో సమంత రాజ్‌తో సరదాగా కనిపించడం, కొన్నిట్లో చేతులు పట్టుకోవడం వంటివి డేటింగ్ రూమర్స్‌కి ఆజ్యం పోశాయి.

ప్రస్తుతం మా ఇంటి బంగారం ఇది సమంత నటిస్తూ, నిర్మిస్తున్న తెలుగు సినిమా. ఆమె తన బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ గృహిణిగా కనిపిస్తూ, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో డబుల్ బ్యారెల్ గన్‌తో సీరియస్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుందని, 2025లో రిలీజ్ అవుతుందని టాక్. ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda)కూడా ఈ సినిమాలో ఉండొచ్చని రూమర్స్ ఉన్నాయి. రక్త బ్రహ్మాండం రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఫాంటసీ వెబ్ సిరీస్‌లో సమంత లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బీ కూడా నటిస్తున్నారు. ఇది ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్, 2025లో రిలీజ్ కానుంది. సమంత డైరెక్టర్ అట్లీతో ఓ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. గతంలో సమంత, అట్లీ కలిసి "తెరి" సినిమాలో వర్క్ చేశారు, ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ కానుందని టాక్. కానీ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సమంత గత ఏడాది "సిటాడెల్: హనీ బన్నీ" వెబ్ సిరీస్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది.

ehatv

ehatv

Next Story