రవితేజ కూతురు మోక్షద సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందని టాక్ నడుస్తోంది.

రవితేజ కూతురు మోక్షద సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందని టాక్ నడుస్తోంది. ఆమె సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేరి ప్రొడక్షన్ విషయాలు నేర్చుకుంటోందట. అయితే, ఆమె హీరోయిన్‌గా వస్తుందా లేక నిర్మాణ రంగంలో స్థిరపడుతుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె చిన్న సినిమాలు లేదా సిరీస్‌ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తోందని కూడా సమాచారం. ఇప్పుడు ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేస్తోంది. మోక్షద భూపతిరాజు, 2003లో జన్మించింది, రవితేజ, కళ్యాణి దంపతుల పెద్ద కూతురు. ఆమె ఇప్పటివరకు స్పాట్‌లైట్‌కు దూరంగా ఉండేది, కానీ, సినిమా రంగంలోకి అడుగుపెడుతోందని టాక్. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆమె తన మొదటి ప్రాజెక్ట్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో యువ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటిస్తున్నట్లు టాక్.
మోక్షద(Mokshadha ) నటిగా కంటే, ప్రొడక్షన్ లేదా క్రియేటివ్ రోల్స్‌లో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఆమె తండ్రి రవితేజ లాగా మాస్ ఫాలోయింగ్‌తో కాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో సినిమా నిర్మాణంపై ఫోకస్ చేస్తుందని అంటున్నారు. ఆమె ఇప్పటికే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి నేర్చుకుంటూ, ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేయడానికి సన్నాహాలు చేస్తోందని బజ్. మోక్షద గురించి పబ్లిక్‌లో ఎక్కువ ఫోటోలు లేదా పర్సనల్ డీటెయిల్స్ అంతగా బయటకు రాలేదు, ఎందుకంటే రవితేజ తన ఫ్యామిలీని మీడియా గ్లామర్‌కు దూరంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఆమె చదువు గురించి కూడా బయటకు పెద్దగా సమాచారం లేదు, కానీ యంగ్ ఏజ్‌లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తే, సినిమాలపై ఆమెకు మంచి ప్యాషన్ ఉందని అర్థమవుతోంది. కొందరు ఆమె నటిగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది, కానీ ప్రస్తుతానికి ఆమె ఫోకస్ ప్రొడక్షన్ సైడ్‌లోనే ఉన్నట్లు సమాచారం. రవితేజ బ్యానర్‌లో లేదా ఇతర పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి ఆమె మరిన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చని ఇండస్ట్రీలో ఊహాగానాలు నడుస్తున్నాయి.
