Sudha Kongara : ఫూలేను సావర్కర్‌తో పోల్చినందుకు వెరీ వెరీ సారీ.. సుధా కొంగర
గురు, ఆకాశం నీ హద్దురా వంటి సినిమాలు తీసిన సుధా కొంగర ఘోర తప్పిదం చేశారు. చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పుకున్నారు. జ్యోతిరావు ఫూలేతో సావర్కర్‌ను పోచ్చారు. తర్వాత నాలిక్కర్చుకుని సారీచెప్పారు. ఆమె తీసిన లేటెస్ట్ సినిమా సర్ఫీరా.
గురు(Guru), ఆకాశం నీ హద్దురా(Aakaasam Nee Haddhu Ra) వంటి సినిమాలు తీసిన సుధా కొంగర(Sudha Kongara ) ఘోర తప్పిదం చేశారు. చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పుకున్నారు. జ్యోతిరావు ఫూలేతో సావర్కర్‌ను పోచ్చారు. తర్వాత నాలిక్కర్చుకుని సారీచెప్పారు. ఆమె తీసిన లేటెస్ట్ సినిమా సర్ఫీరా. ఇందులో అక్షయ్‌కుమార్ హీరో. జులై 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా సుధా కొంగర చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధా చరిత్ర పట్ల తనకున్న అవగాహనారాహిత్యాన్ని చాటుకున్నారు. ఆమె ఏమన్నదంటే 'నాకు సావర్కర్(Savarkar) అంటే చాలా ఇష్టం. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను చదివించాలని ఎంత ఒత్తిడి చేసినా భార్య మాత్రం ఇంట్లోనే ఉండి గృహిణిగా ఉండాలనుకుంది. ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్లు చదువుకోలేదు కాబట్టి. ఆమె స్కూల్‌కు, కాలేజీకి వెళ్లినప్పుడు వీధిలో అందరూ ఆమెను అవమానించారు. దీంతో సావర్కరే ఆమెను స్కూల్‌కు తీసుకెళ్లేవాడు. నాప్రశ్న అక్కడి నుంచే మొదలయ్యింది' అని కొంగర సుధ చెప్పుకొచ్చారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) చేసిన పనులను సావర్కర్ ఖాతాలో వేసిన సుధను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. కనీసం చరిత్ర తెలుసుకోవాలని కామెంట్ చేశారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో సుధా కొంగర స్పందించారు. సావర్కర్‌ను జ్యోతిరావు ఫూలేతో పోల్చినందుకు క్షమాపణలు చెప్పారు. 'నా తప్పును క్షమించండి. నాకు పదిహేడేళ్ల వయసులో, బాలికల విద్యపై నా క్లాస్‌లలో మా టీచర్ చెప్పిన దాని ఆధారంగా నేను ఇంటర్వ్యూ చేశాను. ఒక హిస్టరీ క్లాస్ స్టూడెంట్‌గా నేను ఫ్యాక్ట్ చెక్ చేసి ఉండాలి. ఇది నా పొరపాటు. భవిష్యత్తులో ఇలాంటివి జరగవని నేను హామీ ఇస్తున్నాను. నా ప్రసంగంలో తప్పుడు సమాచారాన్ని ఎత్తి చూపిన వారికి ధన్యవాదాలు. నేను జ్యోతిబాఫూలే సావిత్రిఫూలేకి ఎప్పటికీ గౌరవిస్తాను' అని సుధ కొంగర చెప్పారు.
Filmmaker Sudha Kongara Issues Apology After Confusing Jyotiba Phule With Veer Savarkar