సినీ నటి ఖుష్బూ సుందర్‌ అందరికీ సుపరిచితమే. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినీ నటి ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar )అందరికీ సుపరిచితమే. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా ఆమె ప్రజలకు దగ్గరైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌(green dress)లో చాలా స్లిమ్‌గా అదరిపోయే గెటప్‌లో ఫొటోలను వదిలింది. ఆ ఫొటోల్లో 54 ఏళ్ల ఖుష్బూ సుందర్‌.. 16 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫొటోలకు 'బ్యాక్‌ టూ ద ఫ్యూచర్‌(Back to the Future)' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ఈ మేరకు ఖుష్బూను ట్రోల్స్‌ చేస్తున్నారు. సన్నగా మారడానికి ఏం చేశారు.. ఏమైనా ఇంజెక్షన్స్‌ చేయించుకున్నారా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రోలర్స్‌కు ఖుష్బూ సైతం అదే రీతిలో కౌంటర్‌ ఇచ్చారు. 'మీరు ఎలాంటి మనుషులు..?' అంటూ ప్రశ్నించారు. 'మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్‌ మీడియాలో చూపించరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు' అంటూ గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Updated On 16 April 2025 12:00 PM GMT
ehatv

ehatv

Next Story