Renukaswamy Murder Case : బ్యారక్‌లో ఒంటరిగా ఏడుస్తూ పవిత్రా గౌడ.. లేటుగా నిద్రపోతున్న దర్శన్!
కర్నాటకలో సంచలనం రేపుతున్న రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్నారు.
కర్నాటక(Karnataka)లో సంచలనం రేపుతున్న రేణుకాస్వామి హత్య కేసు(Renukaswamy murder case)లో అరెస్ట్ అయిన నటుడు దర్శన్(Actor Darshan Thoogudeepa) ప్రస్తుతం పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్నారు. ఇతర ఖైదీల బ్యారక్‌లో దర్శన్‌ను ఉంచితే వారి నుంచి సమస్యలు వస్తాయని ఆయనకు ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. దర్శన్ ఉన్న సెల్‌కు అటాచ్ వాష్‌రూమ్ ఉంది. విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌కు 6106 నంబరును కేటాయించారు. శనివారం రాత్రి దర్శన్ డిన్నర్‌కు రాగి సంగటి, అన్నం, సాంబారు మజ్జిగ, ఆకుకూర పులుసు ఇచ్చారు. కడుపు నిండా తినలేదు, కండినిండా నిద్ర కూడా పోలేదు. ఉదయం ఆరున్నరకే నిద్రలేచాడు. వేడి నీరు తాగాడు. బ్యారక్ ఆవరణలో వాక్ చేసి స్నానం చేశాడు. బ్రేక్‌ఫాస్ట్‌గా రైత్‌బాత్ ఇచ్చారు. ఇప్పటికే దర్శన్ అరెస్టయ్యి రెండు వారాలు గడిచింది. ఈ రెండు వారాలలో దర్శన్ బరువు కొంచెం తగ్గాడు. బీపీ కూడా కంట్రోల్‌లో లేదట! రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందరూ పరప్పన అగ్రహార జైలులోనే ఉన్నారు. ఇక మహిళా బ్యారక్‌లో పవిత్రాగౌడ్(Pavithra Gowda)ను ఉంచారు. ఇతర ఖైదీలతో ఆమె కలవడం లేదని, ఒంటరిగా ఏడుస్తూ ఉంటోందని కారాగార సిబ్బంది చెబుతున్నారు. జూన్ 8వ తేదీన రేణుకాస్వామి హత్య జరిగింది. ఆ తర్వాత కొందరు సాక్షులను నిందితులు బెదిరించారట! హత్య తర్వాత కొందరు రక్తం మరకలు ఉన్న తమ దుస్తులను కాల్చేవేశారట! సాక్షులకు ప్రాణహాని ఉండటం వల్ల వారి వివరాలను రహస్యంగా ఉంచుతున్నామని పోలీసులు అంటున్నారు. దర్శన్‌తో పాటు ఇతర నిందితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిలోని డేటాను మొత్తం తొలగించి ఉండటాన్ని గమనించామని, వివరాలు రాబట్టేందుకు ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించామని పోలీసులు చెప్పారు. రేణుకాస్వామిని హత్య చేసిన తర్వాత అతడి సెల్‌ఫోన్‌ను రాజకాలువలో నిందితులు పడేశారు. సిమ్‌కార్డు సర్వీసు ప్రొవైడర్ సహకారంతో అతని కాల్‌డేటాను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే దర్శన్ ఇంట్లో లభించిన నగదు వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు అంRenukaswamy Murder Caseదించారు.