Bangladesh National Anthem: ఇప్పట్లో బంగ్లాదేశ్ జాతీయగీతాన్ని మార్చే ఉద్దేశ్యం మాకు లేదు

జాతీయ గీతం విషయాన్ని నేను ఈ ప్రభుత్వానికి వదిలివేస్తున్నాను

Update: 2024-09-08 03:51 GMT

బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని మార్చే ఆలోచన లేదని ఆ దేశ మత వ్యవహారాల సలహాదారు AFM ఖలీద్ హుస్సేన్ తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని మార్చే అవకాశం ఉందని పలు వాదనలు వినిపించాయి. అయితే మార్చే అవకాశాలు ఏమీ లేవని మధ్యంతర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

రాజ్‌షాహిలోని ఇస్లామిక్ ఫౌండేషన్‌ను సందర్శించిన ఖలీద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ వివాదాలు సృష్టించడానికి మధ్యంతర ప్రభుత్వం ఎలాంటి పనులూ చేయదని అన్నారు. బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ మాజీ అమీర్ గులాం ఆజం కుమారుడు అబ్దుల్లాహిల్ అమన్ అజ్మీ ఈ వారం ప్రారంభంలో దేశ జాతీయ గీతం, రాజ్యాంగంలో మార్పు కోసం పిలుపునిచ్చారు. అయితే ఖలీద్ హుస్సేన్ మాత్రం జాతీయ గీతం మార్చే అవకాశాలు లేవని చెప్పారు.

జాతీయ గీతం విషయాన్ని నేను ఈ ప్రభుత్వానికి వదిలివేస్తున్నాను.. మన వద్ద ఉన్న ప్రస్తుత జాతీయ గీతం మన స్వతంత్ర బంగ్లాదేశ్ ఉనికికి విరుద్ధంగా ఉందని అంటున్నారు. ఇది బెంగాల్ విభజన, రెండు బెంగాల్‌ల విలీన సమయాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త జాతీయ గీతాన్ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కొత్త కమీషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. పొరుగు దేశమైన భారత్‌తో స్నేహపూర్వక సంబంధాన్ని బంగ్లాదేశ్ కోరుకుంటోందని ఖలీద్ హుస్సేన్ అన్నారు. మసీదులు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపై దాడులను హీనమైన చర్యలుగా ఖలీద్ హుస్సేన్ అభివర్ణించారు. ప్రార్ధనా స్థలాలపై దాడి చేసేవారు మానవత్వానికి శత్రువులని, ప్రస్తుత చట్టాల ప్రకారం విచారణ చేస్తామని ఖలీద్ హుస్సేన్ అన్నారు.


Tags:    

Similar News