Swaminarayan Temple : కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై దాడి.. మోదీ వ్యతిరేక నినాదాలు
కెనడాలో హిందూ గుడులపై దాడులు కొనసాగుతున్నాయి. ఎడ్మిటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయంపై కొందరు ఆగంతకులు గ్రాఫిటీ పెయింట్ వేశారు.
By : Eha Tv
Update: 2024-07-23 09:01 GMT
కెనడాలో హిందూ గుడులపై దాడులు కొనసాగుతున్నాయి. ఎడ్మిటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయంపై కొందరు ఆగంతకులు గ్రాఫిటీ పెయింట్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్యలపై వ్యతిరేకంగా ఆలయ గేటుపై రాశారు.వీరిద్దరు కెనడా వ్యతిరేకులు అంటూ రాశారు, దుండగుల దుశ్చర్యపై కెనడాలోని విశ్వ హిందూ పరిషత్ రియాక్టయ్యింది. తీవ్రవాద భావజాలంతో కొందరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరోవైపు స్వామి నారాయణ్ ఆలయం విధ్వంసాన్ని కెనడా ఎంపీ చంద్ర మౌర్య ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై దాడి.. మోదీ వ్యతిరేక నినాదాలు