Diet Soda : డైట్ సోడా కూడా డేంజ‌ర్ తెలుసా.?

శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా హానికరం అని మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో చాలా మంది వాటికి దూరం కావడానికి కారణం ఇదే

Update: 2024-08-26 02:42 GMT

శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా హానికరం అని మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో చాలా మంది వాటికి దూరం కావడానికి కారణం ఇదే. దీంతో మార్కెటింగ్ కంపెనీలు తమ శీతల పానీయాల అమ్మకాలను నిర్వహించడానికి కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చాయి. డైట్ సాఫ్ట్ డ్రింక్ లేదా డైట్ సోడా అనే పేర్ల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చాయి. పేరుకు ముందు డైట్‌ జోడించడంతో ఆరోగ్యకరమైన ఆహారం పట్ల స్పృహ ఉన్నవారు కూడా దాని వైపు ఆకర్షితులవుతున్నారు.

తక్కువ షుగ‌ర్‌, కేలరీల కంటెంట్ కారణంగా డైట్ సోడా.. శీతల పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. అయితే ఇవి ఎంత‌ ఆరోగ్య‌క‌ర‌మో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

డైట్ సోడాలను తయారు చేసే కంపెనీలు షుగర్ ఫ్రీ అని పేర్కొంటున్నాయి. దీన్ని జీరో షుగర్, షుగర్ ఫ్రీ, జీరో క్యాలరీ, లో క్యాలరీ డైట్ డ్రింక్ అని కూడా అంటారు. కానీ ఇందులో చక్కెర వేయడానికి బదులు మొక్కజొన్న సిరప్, అస్పర్టమే, స్టెవియా, సుక్రలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లను వాడుతున్నారన్నది నిజం.

పరిశోధన ప్రకారం.. మన మెదడు చక్కెరకు ప్రతిస్పందించిన విధంగానే కృత్రిమ స్వీటెనర్లకు ప్రతిస్పందిస్తుంది. వీటిని తాగిన‌ తర్వాత.. అధిక కేలరీల ఆహారాన్ని తినాలనే కోరిక మరింత పెరుగుతుంది. ఇది ఊబకాయం పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

సుక్రోలోజ్ వంటి స్వీటెనర్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అలాగే ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మరియు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

అస్పర్టమే అనేది క్యాన్సర్ కారకం.. కాబట్టి డైట్ సోడాను అధికంగా తీసుకోవడం మానేయాలి.

డైట్ సోడాలో రుచి కోసం కెఫిన్‌ను వాడ‌టంతో పాటు కార్బొనేషన్ ప్రాసెస్ చేస్తారు. ఇవి అనారోగ్యం అని మ‌న‌కు తెలిసిందే. జీరో షుగర్, జీరో క్యాలరీలను తీసుకుంటే.. త‌ద్వారా క‌లిగే దుష్ప్రభావాలను అంత త్వర‌గా నివారించలేము.

డైట్ సోడాకు బదులుగా కొబ్బరి నీరు, కొంబుచా, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి పోషకాలను అందించే ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవ‌డం మంచిది. రుచి కోసం పుదీనా, నిమ్మ వంటి సహజ రుచులతో కూడిన పానీయాలను తీసుకోవడం మంచిది. బెర్రీలు, ఐస్‌డ్ టీ, బ్లాక్ కాఫీ వంటివి కూడా డైట్ సోడా కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి.

Tags:    

Similar News