అలేఖ్య చిట్టి పికెల్స్ వ్యాపారం తాత్కాలికంగా మూతపడినట్లు తెలుస్తోంది.

అలేఖ్య చిట్టి పికెల్స్ వ్యాపారం తాత్కాలికంగా మూతపడినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఓ కస్టమర్‌తో జరిగిన సంఘటన నుంచి మొదలైంది. కస్టమర్ ఒకరు పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించగా, అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles)యజమాని అయిన అలేఖ్య కస్టమర్‌ని అవమానకరంగా మాట్లాడి, అభ్యంతరకరమైన భాష వాడినట్లు ఆడియో రికార్డింగ్ ఒకటి వైరల్ అయ్యింది. ఆ ఆడియోలో "నీకు పెళ్లి చేసుకోవడం కంటే కెరీర్ సెట్ చేసుకో" అని, ఆర్థిక స్థితిని తక్కువ చేస్తూ, తెలుగులో కొన్ని బూతులు కూడా మాట్లాడింది. ఈ ఆడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా మంది కస్టమర్లు బాయ్‌కాట్ చేస్తామని చెప్పారు, దీంతో వ్యాపారంపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి కారణంగా షాప్ మూసివేయాల్సి వచ్చిందని అంటున్నారు. తర్వాత అలేఖ్య క్షమాపణ చెప్పినట్లు వీడియో విడుదల చేసినట్లు కూడా సమాచారం ఉంది. మరోవైపు అనారోగ్యం కారణంగా అలేఖ్య అలియాస్ చిట్టీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపార యజమాని అలేఖ్య ఆస్పత్రిలో చేరింది. వివాదం తర్వాత ఆమె మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరినట్లు కొందరు చెబుతున్నారు. వివాదం తర్వాత ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ వీడియో విడుదల చేసినప్పటికీ, సోషల్ మీడియాలో విమర్శలు, బాయ్‌కాట్ కాల్స్ కొనసాగాయి. ఈ ఒత్తిడే ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ehatv

ehatv

Next Story