మద్యానికి మొగ్గు చూపుతున్న మగువలు..!!
మద్యానికి మొగ్గు చూపుతున్న మగువలు..!!
దేశంలో మద్యం వైపునకు మహిళలు అడుగులు వేగంగా పడుతున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా సర్వేల ప్రకారం, భారతదేశంలో మహిళల మద్యపానం విషయంలో ఈశాన్య రాష్ట్రాలు ముందున్నాయి. ముఖ్యంగా అస్సాంలో మహిళలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2% ఉంటే, అస్సాంలో ఈ శాతం 16.5%కి దగ్గరగా ఉంది. అస్సాం తర్వాత మేఘాలయ (8.7%) రెండో స్థానంలో, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఈ జాబితాలో ఉంది. అయితే, దేశంలో మొత్తం మీద చూస్తే, మహిళల మద్యపానం పురుషులతో పోలిస్తే చాలా తక్కువే. సుమారు 5% కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే మద్యం తాగుతారని అంచనా. నగరాల్లో, ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో, ఒత్తిడి తగ్గించుకోవడానికి మద్యం వైపు మొగ్గు చూపే యువత సంఖ్య కొంత పెరుగుతోంది. గుజరాత్‌లో కూడా గత ఐదేళ్లలో మద్యం తాగే మహిళల సంఖ్య రెట్టింపైందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. మహిళలు మద్యం తాగడం ఇంకా చాలా చోట్ల తప్పుగా భావిస్తారు, కానీ మారుతున్న సమాజంలో ఈ ధోరణి కొంత పెరుగుతోంది.
భారతదేశంలో మద్యం సేవనం అనేది సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా క్లిష్టమైన అంశం. మహిళల విషయంలో ఇది మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. దేశంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో కేవలం 1.3% మంది మాత్రమే మద్యం తాగుతారు. పురుషులతో పోలిస్తే ఇది చాలా తక్కువ (పురుషుల్లో 18.8%). కానీ ఈ సంఖ్యల వెనుక చాలా వైవిధ్యం దాగి ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల మద్యపానం శాతం దేశ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. అస్సాం: 16.5% మహిళలు మద్యం తాగుతారు. మేఘాలయ: 8.7%., అరుణాచల్ ప్రదేశ్: 3.3%. ఇక సిక్కిం, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా మహిళల మద్యపానం తాగడం గణనీయంగా పెరిగింది. గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో మహిళల మద్యపానం 1% కంటే తక్కువగా ఉంది.
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ మద్యం తయారీ చేస్తారు. మద్యం సేవించడం సామాజిక జీవనంలో భాగంగా ఉంది. , గిరిజన సంఘాల్లో స్థానికంగా తయారు చేసే రైస్ బీర్ లేదా ట్రాడిషనల్ లిక్కర్‌ను పండుగలు, వేడుకల్లో తాగడం సర్వసాధారణం. ఇక్కడ మహిళలు కూడా ఈ సంప్రదాయంలో భాగమవుతారు. దీనికి విరుద్ధంగా ఉత్తరాది రాష్ట్రాలు రాజస్థాన్, యూపీ వంటి చోట్ల మహిళలు మద్యం తాగడానికి సిగ్గు పడతారు.
నగరాల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం, ఐటీ రంగంలో మహిళల ఉద్యోగాలు ఎక్కువవడం వల్ల యువతీ యువకుల్లో మద్యపానం ఒక లైఫ్‌స్టైల్ ట్రెండ్‌గా మారుతోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. గుజరాత్, బీహార్, మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో మద్యం నిషేధం ఉంది. అయినప్పటికీ, గుజరాత్‌లో గత ఐదేళ్లలో మహిళల మద్యపానం రెట్టింపు సర్వే చెప్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా తాగుతున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు కర్నాటక, తెలంగాణ, తమిళనాడులో ఈ సంఖ్య పెరుగుతోంది. , తెలంగాణలో మహిళల్లో మద్యపానం దేశ సగటు కంటే ఎక్కువగా ఉంది. మహిళల్లో మద్యపానం వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిస్, హైపర్‌టెన్షన్ పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, 20% మహిళలు మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళల మద్యం సేవించడం మెల్లగా పెరుగుతోంది, ముఖ్యంగా నగరాల్లో. ఆర్థిక స్వాతంత్ర్యం, పాశ్చాత్య జీవనశైలి ప్రభావం, స్ట్రెస్ రిలీఫ్ కోసం మద్యం వైపు మొగ్గు చూపడం దీనికి కారణాలు.