Hormonal Imbalance : హార్మోన్ల అసమతుల్యత నుండి కాపాడేవి ఇవే..!
మనలో చాలా మంది హార్మోన్ అసమతుల్యతతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.
మనలో చాలా మంది హార్మోన్ అసమతుల్యతతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆరోగ్యవంతంగా జీవించాలంటే హార్మోన్లు కూడా చాలా ముఖ్యం. ఇది ఎక్కువగా మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మధ్యాహ్న భోజనాన్ని దాటవేయడం,. కొందరు ఎక్కువ పని చేయడం.. కొంతమందికి లేట్ నైట్ స్క్రీన్‌లు అలవాటు ఉండటం.. మరికొందరు అతిగా ఆలోచించడం.. దాదాపు ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ఇటువంటి అనేక సమస్యలు కలిగి ఉంటారు. ఇదే మన శరీరం యొక్క హార్మోన్లను అసమతుల్యతకు గురి చేస్తుంది.
హార్మోన్ల అసమతుల్యత వల్ల చిరాకు, అలసట, మొటిమలు, నిద్రలేమి, జుట్టు రాలడం, అజీర్ణం సమస్యలు, బరువు పెరగడం వంటి బారిన పడుతుంటాం. కొన్ని ప్రత్యేక ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఎలాంటి ఆహారం హార్మోన్లను సమతుల్యం చేయగలదో తెలుసుకుందాం.
ఈ ప్రత్యేక ఆహారాలతో హార్మోన్లను సమతుల్యం చేసుకోండి..
మీ ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు కలిగిన ఆరోగ్యకరమైన చియా విత్తనాలు, వాల్‌నట్‌లు, చేపలు మొదలైనవి తీసుకోండి. ఇవి హార్మోన్ ఉత్పత్తి ప్రక్రియను పెంచుతాయి.
అవిసె గింజలు, బ్రోకలీ, మొలకలు, క్యాబేజీ, ధాన్యాలు, పండ్లు వంటి అధిక ఫైబర్ ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈస్ట్రోజెన్ శరీరం నుండి వ్యర్థాల రూపంలో సులభంగా తొలగించబడుతుంది.
లీన్ మీట్, పప్పులు, గుడ్లు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
అవిసె గింజలు- పోషకాలు అధికంగా ఉండే అవిసె గింజలు ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
గుమ్మడికాయ గింజలు - వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
బాదం- ఇది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
నువ్వులు- ఫైటోఈస్ట్రోజెన్ ఇందులో ఉంటుంది, ఇది ఈస్ట్రోజెన్ స్థాయిని నియంత్రిస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు- ఇందులో విటమిన్లు, సెలీనియం ఉన్నాయి, ఇవి ప్రొజెస్టెరాన్, థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.