F&O Trading : ట్రేడింగ్‌లో 46 లక్షల పోగొట్టిన బీటెక్ విద్యార్థి

స్టాక్‌మార్కెట్‌లో ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థి.

By :  Eha Tv
Update: 2024-06-26 10:41 GMT

స్టాక్‌మార్కెట్‌(Stock Market)లో ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థి. స్టాక్‌మార్కెట్లపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ట్రేడింగ్‌(Trading) చేయాలని ఎంత మొత్తుకున్నా వారి సూచనలను పెడచెవిన పెట్టి లక్షలు, కోట్లలో నష్టపోతున్నారు. మార్కెట్‌ నిపుణుల సలహాలు వినని ఓ బీటెక్ స్టూడెంట్ రెండేళ్లుగా ట్రేడింగ్‌ చేసి ఏకంగా రూ.46 లక్షలు సమర్పించుకున్నాడు. రోషన్‌ అగర్వాల్‌ అనే సీఏ దగ్గరికి ఓ బీటెక్‌ విద్యార్థి వచ్చి ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని కోరడంతో ఈ వ్యవహారం బయటపడింది. రోషన్‌ అగర్వాల్ చెప్పిన ప్రకారం తన దగ్గరికి ఓ బీటెక్ విద్యార్థి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు తన దగ్గరికి వచ్చాడని.. అతనికి ఎలాంటి ఆదాయం లేదని.. తల్లిదండ్రులు విడిపోగా తల్లి ఓ హోటల్‌ నడుపుతోందని చెప్పాడు. తన తల్లి ఖాతా నుంచి అప్పుడప్పుడు కొంత నగదు తీసుకొని ట్రేడింగ్ ప్రారంభించాడని సీఏ అన్నారు. డబ్బు పోగొట్టుకోవడంతో లోన్‌ యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్నాడని, ఆ డబ్బు కూడా సరిపోకపోతే స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాడాన్నారు.

ట్రేడింగ్‌ ద్వారా నిత్యం డబ్బు నష్టపోతున్నా అప్పుచేసి మరీ ట్రేడింగ్‌ చేసేవాడు. గడిచిన ఏడాదిలో ఎఫ్‌ అండ్‌ ఓ ద్వారా రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌(F&O Trading) ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడని చెప్పారు.

అయితే ఈ ట్రేడింగ్‌కు ఎందుకు అలవాటు పడ్డావని విద్యార్థిని సీఏ ప్రశ్నించగా తన స్నేహితుడు ఎఫ్‌ అండ్‌ ఓ ద్వారా కోటి సంపాదించాడని విని ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ట్రేడింగ్ ప్రారంభించానని చెప్పుకొచ్చాడట. నష్టపోతుంటే ట్రేడింగ్ మానేయలేవా అన్ని ప్రశ్నిస్తే ట్రేడింగ్‌కు బానిస అయ్యానని.. ఇంత నష్టపోయిన తర్వాత ఇక భవిష్యత్‌లో ట్రేడింగ్‌ చేయనని చెప్పాడు. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలో 90 శాతం మంది మదుపర్లు తమ డబ్బు పోగొట్టుకుంటున్నారని గతంలో సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ అన్నారు. ఎఫ్‌ అండ్‌ వో ట్రేడింగ్‌ చేస్తున్నవారిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు పొందుతున్నారని తెలిపారు. దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తాత్కాలికంగా నష్టాలు వచ్చినా మంచి రాబడులు వస్తాయని సూచించారు.

Tags:    

Similar News