అదానీ(Adani) గ్రూప్ చైర్మన్ గౌతం అదానీపై(Gautham Adani) అమెరికాలో(America) బిలియన్ డాలర్ల లంచం(Bribe), మోసానికి(Fraud) పాల్పడ్డారన్న అభియోగంతో కేసు నమోదైంది.
అదానీ(Adani) గ్రూప్ చైర్మన్ గౌతం అదానీపై(Gautham Adani) అమెరికాలో(America) బిలియన్ డాలర్ల లంచం(Bribe), మోసానికి(Fraud) పాల్పడ్డారన్న అభియోగంతో కేసు నమోదైంది. అదానీతో పాటు ఆయన సమీప బంధువు సాగర్ అదానీతో(Sagar adani) పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ సరఫరా కాంట్రాక్టుల కోసం భారత అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలో కూడా అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు తెలిపారు. అదానీ సంపద 69.8 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో 22వ అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ స్టాక్‌లలో సుమారు 150 బిలియన్ డాలర్లు కరిగిపోయాయి. దీంతో అదానీ షేర్ హోల్డర్లు ఆందోళన చెందుతున్నారు.