దేశ వ్యాప్తంగా బంగారం(Gold Price), వెండి ధరలు(silver price) మళ్లీ పుంజుకున్నాయి.
దేశ వ్యాప్తంగా బంగారం(Gold Price), వెండి ధరలు(silver price) మళ్లీ పుంజుకున్నాయి. వరుసగా వరుసగా మూడో రోజు కూడా రేట్లు పెరిగాయి. ఈ మధ్య 80 వేలు దాటిన బంగారం.. తగ్గుతూ తగ్గుతూర 76 వేలకి దిగి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ధరలు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ(Political), ఆర్థిక(Economy) కారణాలతో పాటు స్టాక్ మార్కెట్ల(stock market) ప్రభావం కూడా బంగారం ధరలపై ఉంటుందనే చెప్పాలి. ఈరోజు హైదరాబాద్(Hyderabad), విజయవాడలో(Vijayawada) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 77,630కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 71,160 స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 77,780కి ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,310 ఉంది. అయితే వెండి ధరలు కిలోకు 4000 రూపాయలు తగ్గడం కొంత ఊరట లభించింది.